Home National_news గోల్డ్ రింగ్‌తో గేమ్ ఛేంజ్?

గోల్డ్ రింగ్‌తో గేమ్ ఛేంజ్?

మూడు పార్టీలకు రెండు సీట్లు టెన్షన్.
తమిళనాడు ఉప ఎన్నికలో విజయ్ సైలెంట్ యాక్షన్.

తమిళనాడు రాజకీయ తెరపై ఇప్పుడు అసలు క్లైమాక్స్ మొదలైంది. ఒకవైపు సినీ స్టార్ ఇమేజ్‌తో రాజకీయాల్లోకి వచ్చి అధికారాన్ని అందుకున్న ముఖ్యమంత్రి విజయ్.. మరోవైపు దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాలను శాసించిన డీఎంకే, అన్నాడీఎంకే. మధ్యలో రెండు ఉప ఎన్నికలు.. మదురాంతకం, ధరాపురం. అక్టోబర్ 6న జరగనున్న ఈ పోరు కేవలం రెండు సీట్ల కోసం జరిగే ఎన్నిక కాదనే చర్చ మొదలైంది. విజయ్ అనుసరిస్తున్న ‘తక్కువ మాటలు.. ఎక్కువ పని’ వ్యూహానికి ఇది తొలి కీలక పరీక్షగా మారింది. అదే సమయంలో సెప్టెంబర్ 28న ప్రారంభం కానున్న ‘థై మామన్ తంగా మోతిరం’ పథకం రాజకీయ వేడి పెంచుతోంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో జన్మించే శిశువులకు ఒక గ్రాము బంగారు ఉంగరం.. రూ.755 కోట్ల భారీ కేటాయింపు.. 1.28 లక్షల ఉంగరాల తొలి విడత.. ఇవన్నీ ఇప్పుడు రాజకీయ చర్చలోకి వచ్చాయి. అయితే ఎన్నికల సంఘం నిబంధనలు ఈ పథకాన్ని ఉప ఎన్నికల నియోజకవర్గాల్లో నేరుగా అమలు చేయకుండా అడ్డుకున్నాయి. ఇక పార్టీ మారిన అన్నాడీఎంకే ఎమ్మెల్యేలనే టీవీకే మళ్లీ బరిలోకి దించడం మరో సంచలనం. అసలు విజయ్ వ్యూహం ఓటుగా మారుతుందా? డీఎంకే, అన్నాడీఎంకే పాత బలాన్ని నిలబెట్టుకుంటాయా? అక్టోబర్ 9న వచ్చే తీర్పు తమిళనాడు రాజకీయాల్లో ఏ కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుంది?

#Vijay #TVK #TamilNaduPolitics #TamilNaduBypolls #ByElections2026 #Madurantakam #Dharapuram #DMK #AIADMK #TVKPolitics #VijayPolitics #GoldRingScheme #TamilNaduElections #PoliticalBattle #TamilNaduNews