మానసిక ఆరోగ్యంపై ఫోకస్ .
అధికారులకు లోకేశ్ ఆదేశాలు.
అమరావతిలో విద్య, ఉన్నత విద్య, స్కిల్ డెవలప్‌మెంట్ శాఖల ఉన్నతాధికారులతో మంత్రి నారా లోకేశ్ సమీక్ష నిర్వహించారు. విద్యార్థుల్లో మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు అవగాహన, గైడెన్స్, ఇన్‌స్టిట్యూషనల్ సపోర్ట్‌తో ప్రత్యేక కార్యక్రమాన్ని మిషన్ మోడ్‌లో చేపట్టాలని ఆదేశించారు. విద్యార్థుల మెంటల్ హెల్త్ కోసం సిద్ధం చేసిన ‘కేర్ ఏపీ’ టూల్ పైలట్ పూర్తయినట్లు అధికారులు తెలిపారు. హార్ట్‌ఫుల్ యోగా కార్యక్రమంలో భాగంగా తొలి దశలో 935 ప్రభుత్వ పాఠశాలల్లో 4.47 లక్షల మంది విద్యార్థులకు యోగా శిక్షణ అందించాలని లోకేశ్ సూచించారు. ఇందుకోసం 2 వేల మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చి, ఈ ఏడాది హైబ్రిడ్ విధానంలో తరగతులు నిర్వహించనున్నారు.
10వ తరగతి ఫలితాలపై ఫోకస్
విద్యా సంస్కరణల తర్వాత అధికారులు ఇక ఫలితాలపై దృష్టి పెట్టాలని లోకేశ్ స్పష్టం చేశారు. టెన్త్, ఇంటర్‌లో 90 శాతం ఫలితాలు సాధించే లక్ష్యంతో పనిచేయాలని ఆదేశించారు. ‘మిషన్ మార్చ్’ను సమర్థంగా అమలు చేస్తూ వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. సబ్జెక్టుల్లో వెనుకబడిన ఉపాధ్యాయులకు మెంటార్ టీచర్ల ద్వారా శిక్షణ ఇవ్వాలని చెప్పారు. మరోవైపు స్కిల్ డెవలప్‌మెంట్‌పై సమీక్షిస్తూ పీఎం సేతు పథకంలో భాగంగా తొలి దశలో 10 పారిశ్రామిక అనుసంధానిత ఐటీఐ క్లస్టర్లు అభివృద్ధి చేయాలని ఆదేశించారు. స్టీల్, రెన్యువబుల్ ఎనర్జీ, ఆక్వా, ఫార్మా సంస్థల సహకారంతో 90 రోజుల కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. ఇప్పటివరకు 5.43 లక్షల మందికి నైపుణ్య శిక్షణ, జాబ్ మేళాల ద్వారా 1.72 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించినట్లు అధికారులు వెల్లడించారు.
#NaraLokesh #StudentMentalHealth #StudentStress #CareAP #HeartfulnessYoga #APEducation #GovernmentSchools #MissionMarch #Class10Results #IntermediateResults #PMSETU #SkillDevelopment #ITIClusters #EducationReforms #AndhraPradesh











