ఫైర్ బ్రాండ్ జగన్ కు బలమా.. భారమా
2029 గుడివాడ ఎన్నికల ఛేంజింగ్ చాప్టర్
గుడివాడలో ఒకప్పుడు కొడాలి నాని అంటేనే వైసీపీ.. నాని అంటేనే గుడివాడ అన్నంతగా రాజకీయ సమీకరణం మారిపోయింది. నాలుగు వరుస విజయాలతో ప్రత్యర్థులకు సవాల్‌గా నిలిచిన ఫైర్‌బ్రాండ్ నేత.. 2024లో ఏకంగా 53,040 ఓట్ల తేడాతో కుప్పకూలారు. 2019లో 19,479 ఓట్ల మెజారిటీతో గెలిచిన అదే నాయకుడికి ఐదేళ్లలో ఇంతటి ఎదురుదెబ్బ ఎందుకు? ఇది కేవలం నాని ఓటమా? లేక ఆయన ప్రాతినిధ్యం వహించిన రాజకీయ శైలికి గుడివాడ ఓటరు ఇచ్చిన తీర్పా? ఇప్పుడు అసలు కథ ఇక్కడే మొదలవుతోంది. పదవి పోయింది.. అధికారం దూరమైంది.. కానీ రాజకీయ అనుభవం మాత్రం ఆయన వెంట ఉంది. మరి నాని తిరిగి పుంజుకుంటారా? వైసీపీ ఆయనను మళ్లీ ముందుకు తీసుకొస్తుందా? లేక గుడివాడలో కొత్త ముఖానికి జగన్ మార్గం సుగమం చేస్తారా? 2029పై నాని చేసిన వ్యాఖ్యలు ఈ ప్రశ్నలకు మరింత పదును పెడుతున్నాయి. ఒకప్పుడు వైసీపీకి బలమైన ఆయుధంగా కనిపించిన నాని.. ఇప్పుడు పార్టీకి బలమా? భారమా? గుడివాడలో మారుతున్న సమీకరణాల మధ్య ఈ ఒక్క ప్రశ్నే ఇప్పుడు వైసీపీ భవిష్యత్ వ్యూహానికి కేంద్రబిందువుగా మారింది. నాని రాజకీయ అధ్యాయం ముగిసిందా.. లేక అసలు రీ-ఎంట్రీ ఇప్పుడే మొదలవుతుందా?
#KodaliNani #Gudivada #GudivadaPolitics #Gudivada2029 #YSJagan #YSRCP #KodaliNaniComeback #GudivadaElection #APPolitics #AndhraPradeshPolitics #JaganStrategy #YSRCP2029 #2029Elections











