Home National_news మోదీ సేవా ప్రస్థానంపై కాశీలో యాత్ర

మోదీ సేవా ప్రస్థానంపై కాశీలో యాత్ర

సేవా సంకల్ప్‌ అభియాన్‌లో చంద్రబాబు.

ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పురస్కరించుకుని కాశీలో నిర్వహిస్తున్న ‘సేవా సంకల్ప్‌ అభియాన్‌’లో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. ముఖ్యమంత్రిగా, ప్రధానిగా మోదీ అందించిన సేవలను గుర్తుచేస్తూ దేశవ్యాప్తంగా నెల రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా వారణాసి–వాద్‌నగర్‌ను అనుసంధానిస్తూ ‘సేవా యాత్ర’ చేపడుతున్నారు. యువత, ప్రజాప్రతినిధులు, సేవా కార్యకర్తల భాగస్వామ్యంతో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ప్రజా భాగస్వామ్యం, సేవాభావం, సామాజిక బాధ్యతే దేశాభివృద్ధికి కీలకమనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం ఈ కార్యక్రమం ఉద్దేశంగా నిర్వాహకులు తెలిపారు.

కాశీ విశ్వనాథుడి దర్శనం.. యాత్రకు జెండా

చంద్రబాబు గురువారం ఉదయం 7.30 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరి 9.35 గంటలకు వారణాసి చేరుకుంటారు. ఉదయం 11.15 గంటలకు శ్రీ కాశీ విశ్వనాథుడిని దర్శించుకున్న అనంతరం రుద్రాక్ష్‌ అంతర్జాతీయ కన్వెన్షన్‌ సెంటర్‌కు చేరుకుంటారు. అక్కడ జరిగే ‘వారణాసి–వాద్‌నగర్‌ సేవా యాత్ర’ ఫ్లాగ్‌ ఆఫ్‌ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. ప్రతి గ్రామం, ప్రతి కుటుంబం, ప్రతి యువకుడు, ప్రతి మహిళ అభివృద్ధి ప్రక్రియలో భాగస్వామి కావాలనే స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమం అనంతరం చంద్రబాబు మధ్యాహ్నం 3.10 గంటలకు వారణాసి నుంచి బయలుదేరి సాయంత్రం 5.15 గంటలకు అమరావతి చేరుకోనున్నారు.

 

#ChandrababuNaidu #NarendraModi #SevaSankalpAbhiyan #SevaYatra #Varanasi #Vadnagar #KashiVishwanath #Modi25Years #PublicService #AndhraPradeshCM #APPolitics #VaranasiVisit #SevaSankalp