మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఆత్మకూరులో ఇప్పటం రోడ్డు నాలుగవ లైన్ లో శ్రీవిజయ దుర్గా చాముండేశ్వరి అమ్మవారి దేవాలయం పక్కన సోమవారం వినాయక చవితి సందర్భంగా వినాయక విగ్రహం ఏర్పాటు చేసి, పూజలు నిర్వహించారు. శ్రీలక్ష్మీ గణపతి సేవాసమితి కమిటీ వారి ఆధ్వర్యంలో ఈ పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. జవ్వాది హరిబాబు, సుజాత దంపతులు ఇక్కడ వినాయక విగ్రహం ఏర్పాటు చేశారు. ప్రగడ తిరుమలేశ్వరరావు స్వామివారికి లడ్డుని బహూకరించారు.
#IppatamRoad #Ippatam #Mangalagiri #MangalagiriGanesh #VinayakaChavithi #GaneshChaturthi #GaneshPuja #GaneshIdol #GaneshFestival #Atmakur #SriLakshmiGanapatiSevaSamithi #MangalagiriNews #GunturDistrict #AndhraPradesh #VinayakaChavithi2026 #GaneshCelebrations #GaneshPuja2026 #APNews #LocalNews #FestivalNews











