Home AP ఇంటర్వెల్‌ దాకా ఒకే… అసలు ఆట ఇప్పుడే మొదలు..!

ఇంటర్వెల్‌ దాకా ఒకే… అసలు ఆట ఇప్పుడే మొదలు..!

ప్రాజెక్టు జలపాతాలు… ఉద్యోగులకు వరాలు..
కొత్త పెన్షన్ల ఆదేశాలు… కూటమి ‘క్లీన్‌స్వీప్‌’ లెక్కలు
జెంటిల్‌మెన్ అలియాస్ వాటర్‌మెన్ లోకల్ స్కెచ్ ఇదేనా..!

బస్తీమే సవాల్‌.. అసలు లెక్క తేలేది అక్కడే! ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ఇప్పటివరకు ఒక లెక్క.. ఇక నుంచి మరో లెక్క! 2024లో కూటమికి 164 సీట్ల భారీ విజయాన్ని అందించిన ఓటరు.. రెండున్నరేళ్ల పాలన తర్వాత అదే తీర్పును మళ్లీ సమర్థిస్తాడా? లేక గ్రామం, వార్డు, మున్సిపాలిటీ స్థాయిలో కొత్త సమీకరణాలకు తెరతీస్తాడా? ఇదే ఇప్పుడు అసలు ప్రశ్న. ప్రభుత్వం స్థానిక ఎన్నికలకు వేగం పెంచుతోంది. మరోవైపు వెలిగొండ, పోలవరం నీటి ప్రాజెక్టుల ద్వారా అభివృద్ధి కథనాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తోంది. ఉద్యోగులకు డీఏలు, పీఆర్‌సీకి కదలిక.. పెన్షనర్లకు వరుస ప్రయోజనాలు.. కొత్త పెన్షన్లకు దరఖాస్తులు.. ఇలా ఒకదాని వెంట ఒకటి నిర్ణయాలు తెరపైకి వస్తున్నాయి. బయటికి చూస్తే ఇవన్నీ పాలనా చర్యలే.. కానీ ఎన్నికల ముందు ఈ టైమింగ్‌ రాజకీయంగా మాత్రం ఎన్నో ప్రశ్నలు రేపుతోంది. కూటమి లక్ష్యం ఒక్కటేనా? 2024లో వచ్చిన తీర్పు అసెంబ్లీ గోడలు దాటి బస్తీ వరకు ఉందని నిరూపించడమేనా? మరోవైపు వైసీపీకి ఇదే పునరాగమనానికి తొలి అవకాశం కావచ్చా? స్థానిక ఎన్నికల్లో కూటమి క్లీన్‌స్వీప్‌ చేస్తే 2029కు ముందే రాజకీయ ఆధిపత్యం మరింత బలపడుతుంది. వైసీపీ గట్టి పోటీ ఇస్తే మాత్రం కథ ఒక్కసారిగా మలుపు తిరుగుతుంది. ఎందుకంటే అసెంబ్లీ ఓటు వేరు.. బస్తీ ఓటు వేరు! అభ్యర్థి ఎవరు? స్థానిక బలం ఎంత? కేడర్‌ ఎవరి వెంట? గ్రామంలో అసంతృప్తి ఎటు? చివరికి ఓటరు తీర్పు ఎవరికి అనుకూలం? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పేది నేతలు కాదు.. నేలమీద ఉన్న ప్రజలే. అందుకే ఇది సాధారణ స్థానిక ఎన్నిక కాదు.. కూటమి పాలనకు తొలి పెద్ద రీటెస్ట్‌.. వైసీపీ భవిష్యత్తుకు కీలక టర్నింగ్‌ పాయింట్‌. బస్తీమే సవాల్‌.. ఎవరి బలం నిజమో తేలేది అక్కడే! అసలు లెక్క ఏంటి?

 

#APLocalElections #APLocalElections2026 #AndhraPradeshLocalElections #LocalBodyElections #APPolitics #AndhraPradeshPolitics #CoalitionGovernment #TDP #JanaSena #BJP #TDPJanaSenaBJP #YSRCP #ChandrababuNaidu #JaganMohanReddy #VelugondaProject #PolavaramProject #APEmployees #DAHike #PRC #Pensioners #NewPensions #APGovernment #PoliticalAnalysis #APPoliticalNews #APNews