2023 మాటను గుర్తు చేసిన వైసీపీ అధినేత.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్టు చేశారు. “భోగాపురం నుంచి 2026లో విమానాలు ఎగురుతాయి. ఈ విషయం 2023లో నేను శంకుస్థాపన చేసిన రోజే చెప్పాను” అంటూ పేర్కొన్నారు. ఆ సందర్భంగా చేసిన ప్రసంగానికి సంబంధించిన వీడియోను కూడా ఫేస్‌బుక్‌లో పంచుకున్నారు. తాను ప్రకటించిన గడువు ప్రకారమే విమానాశ్రయం అందుబాటులోకి వచ్చిందని పోస్టు ద్వారా గుర్తు చేశారు.
ఆ క్రెడిట్ తమదేనంటున్న వైసీపీ
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం రూపుదిద్దుకోవడంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ పాత్ర కీలకమని ఆ పార్టీ పేర్కొంది. కోర్టు వివాదాల పరిష్కారం, భూసేకరణ, నిర్వాసితులకు పునరావాసం, కేంద్ర అనుమతుల సాధన, నిర్మాణ పనుల ప్రారంభం వంటి ప్రధాన ప్రక్రియలు తమ ప్రభుత్వ హయాంలో పూర్తయ్యాయని వివరించింది. 2023 మే 3న శంకుస్థాపన చేసిన సమయంలోనే 2026లో విమానాశ్రయం ప్రారంభమవుతుందని వైఎస్ జగన్ ప్రకటించారని గుర్తు చేసింది.
ఉత్తరాంధ్రకు కొత్త అవకాశాలు
భోగాపురం విమానాశ్రయం ప్రారంభంతో ఉత్తరాంధ్రకు అంతర్జాతీయ అనుసంధానం మరింత బలోపేతం అవుతుందని వైఎస్సార్‌సీపీ అభిప్రాయపడింది. రాత్రి వేళల్లో అంతర్జాతీయ విమాన సర్వీసులు నడిపే అవకాశాలు పెరుగుతాయని, విదేశీ కనెక్టివిటీతో పెట్టుబడులు, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు విస్తరించే అవకాశం ఉందని పేర్కొంది. వెనుకబడిన ఉత్తరాంధ్ర ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చే ప్రాజెక్టుగా భోగాపురం విమానాశ్రయం నిలుస్తుందని వైఎస్ జగన్ తన పోస్టు ద్వారా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
#YSJagan #YSJaganMohanReddy #BhogapuramAirport #BhogapuramInternationalAirport #YSRCP #AndhraPradesh #NorthAndhra #Jagan2023Promise #BhogapuramAirport2026 #APPolitics #AndhraPradeshPolitics #NorthAndhraDevelopment #JaganPost #YSRCPNews #PoliticalNews











