ఫలిస్తోన్న రెండు దశాబ్దాల దౌత్యం.
నాయకత్వానికి చిరునామాగా భారత్ .
ఒకప్పుడు ప్రపంచ శక్తుల మధ్య నిలబడి.. ఇప్పుడు ప్రపంచాన్ని తనవైపు తిప్పుకుంటున్న భారత్! న్యూఢిల్లీలో జరిగిన 18వ బ్రిక్స్ సదస్సు కేవలం మరో అంతర్జాతీయ సమావేశం కాదు.. భారత దౌత్య శక్తికి కొత్త నిర్వచనం. చైనా, రష్యా, ఇరాన్, సౌదీ అరేబియా వంటి పరస్పర ప్రయోజనాలు, విభేదాలు ఉన్న దేశాలు ఒకే వేదికపైకి వచ్చాయి. కొద్ది నెలల క్రితం ఒక్క ఉమ్మడి ప్రకటనపై కూడా ఏకాభిప్రాయం కుదరని బ్రిక్స్.. ఢిల్లీలో భారత అధ్యక్షతన ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. ఐరాస భద్రతా మండలిలో భారత్ పాత్రకు చైనా, రష్యా మద్దతు.. పహల్గామ్ ఉగ్రదాడిపై 11 దేశాల ఖండన.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో గ్లోబల్ సౌత్‌కు అధిక ప్రాతినిధ్యం.. స్థానిక కరెన్సీల్లో వాణిజ్యం.. సురక్షిత సముద్ర మార్గాలు.. ఇవన్నీ ఒకే కథ చెబుతున్నాయి. భారత్ ఇక ఏ శిబిరంలో చేరాలి అని ఆలోచించే దేశం కాదు.. వివిధ శక్తులను ఒకే వేదికపైకి రప్పించి అజెండాను నిర్దేశించే దేశం. అదే సమయంలో పుతిన్‌తో కీలక భేటీ, జిన్‌పింగ్‌తో చర్చలు, అమెరికా-యూరప్ భాగస్వామ్యాల మధ్య సమతుల్యత.. ఢిల్లీ దౌత్యానికి మరో కోణాన్ని చూపించాయి. ఇది నాన్-అలైన్‌మెంట్ ముగింపా? లేక భారత్ కేంద్రంగా కొత్త ప్రపంచ సమీకరణానికి ఆరంభమా? అసలు కథ ఏంటి?
#India #IndianDiplomacy #IndiaForeignPolicy #GlobalLeadership #BRICS #BRICSSummit2026 #18thBRICSSummit #BRICSIndia #NewDelhi #GlobalSouth #NarendraModi #ModiPutin #ModiXi #XiJinping #VladimirPutin #IndiaChinaRelations #IndiaRussiaRelations #StrategicAutonomy #BRICSDeclaration #UNSecurityCouncil #LocalCurrencyTrade #Geopolitics #GlobalPolitics #IndiaGlobalPower #WorldPolitics











