Home AP క్రూడ్ క్రూరత్వం.. చమురు మార్కెట్‌కు యుద్ధం సెగ

క్రూడ్ క్రూరత్వం.. చమురు మార్కెట్‌కు యుద్ధం సెగ

సరఫరా భయాలతో చమురు భగ్గు.

పశ్చిమాసియాలో వరుస దాడులు ప్రపంచ చమురు సరఫరాపై కొత్త ఆందోళనలు రేకెత్తించడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మంగళవారం భారీగా పెరిగాయి. సౌదీ అరేబియాలోని ఈస్ట్-వెస్ట్ చమురు పైప్‌లైన్ దాడుల కారణంగా నిలిచిపోవడం పరిస్థితిని మరింత సంక్లిష్టంగా మార్చింది. ఉదయం 0406 GMT సమయానికి బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ $1.37 పెరిగి బ్యారెల్‌కు $107.05కు చేరాయి. అమెరికా వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ ధర $1.53 పెరిగి $102.92కు చేరింది. రెండు కీలక బెంచ్‌మార్క్‌లు గత సెషన్‌లోనూ 1 శాతానికి పైగా పెరిగాయి.

పైప్‌లైన్ నిలిచిపోవడంతో పెరిగిన ముప్పు

యెమెన్‌లోని ఇరాన్ మద్దతుగల హౌతీ దళాలు సోమవారం దక్షిణ సౌదీలోని ఖమీస్ ముషైత్ సైనిక స్థావరంపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేశాయి. ఈ దాడుల్లో విమానాల హ్యాంగర్లు, రాడార్ వ్యవస్థలు, రన్‌వేలు, మందుగుండు సామగ్రి కేంద్రాలు దెబ్బతిన్నట్లు సమాచారం. సెప్టెంబర్ 11న జరిగిన మరో దాడి సౌదీ ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్ కార్యకలాపాలను దెబ్బతీసింది. హోర్ముజ్ జలసంధిని దాటకుండా యాన్‌బు పోర్టు ద్వారా చమురును తరలించేందుకు ఈ పైప్‌లైన్ కీలకం. రోజుకు దాదాపు 40 లక్షల బ్యారెళ్ల చమురును ఈ మార్గం ద్వారా తరలించే సామర్థ్యం ఉంది. ఇది ప్రపంచ సరఫరాలో దాదాపు 4 శాతానికి సమానం.

హర్మూజ్‌లో రాకపోకలు తగ్గుదల

హర్మూజ్ జలసంధిలో పరిస్థితి కూడా మార్కెట్లను కలవరపెడుతోంది. వారాంతంలో ఈ మార్గంలో రోజుకు 10 కంటే తక్కువ నౌకలు మాత్రమే ప్రయాణించాయి. సాధారణంగా 10 రోజుల సగటు 14 రాకపోకలతో పోలిస్తే ఇది గణనీయమైన తగ్గుదల. ప్రపంచ చమురు సరఫరాలో సుమారు ఐదో వంతు చమురు ఈ మార్గం మీదుగా రవాణా అవుతుంది. పైప్‌లైన్ త్వరగా పునరుద్ధరించకపోతే సౌదీ అరేబియాలో ఎగుమతులకు అందుబాటులో ఉన్న చమురు నిల్వలు కొద్ది రోజుల్లోనే తగ్గిపోయే ప్రమాదం ఉందని కొనుగోలుదారులు, వ్యాపారులు చెబుతున్నారు. పైప్‌లైన్ మరమ్మతులు కొన్ని వారాలు పట్టవచ్చన్న అంచనాలు ధరలపై మరింత ఒత్తిడి పెంచుతున్నాయి. దాడులు కొనసాగడం, హోర్ముజ్ రాకపోకలు సాధారణ స్థితికి రాకపోవడం చమురు ధరలను మరింత పెంచే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

 

#CrudeOil #CrudeOilPrices #OilPrices #BrentCrude #WTI #OilMarket #WestAsia #WestAsiaConflict #SaudiArabia #SaudiOil #OilPipeline #EastWestPipeline #StraitOfHormuz #HormuzStrait #OilSupply #SupplyDisruption #Houthi #HouthiAttacks #Iran #EnergySecurity #GlobalOilMarket #OilNews #CommodityMarket #WorldNews