Home Cinema_News జయమ్మకు గుడ్‌బై రణబలిలో రష్మిక షూట్‌ పూర్తి

జయమ్మకు గుడ్‌బై రణబలిలో రష్మిక షూట్‌ పూర్తి

పాన్‌ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు నెలకొన్న ‘రణబలి’ చిత్రంలో రష్మిక మందన్న తన పాత్రకు గుడ్‌బై చెప్పింది. విజయ్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్‌ డ్రామాలో రష్మిక జయమ్మగా కనిపించనుంది. తాజాగా తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణను పూర్తి చేయడంతో చిత్రబృందం ఆమెకు భావోద్వేగ వీడ్కోలు పలికింది. షూటింగ్‌ చివరి రోజు సందర్భంగా సెట్స్‌లో ప్రత్యేకంగా రూపొందించిన వీడియోను మేకర్స్‌ విడుదల చేశారు. ఇందులో రష్మికతో నటీనటులు, సాంకేతిక బృందం పంచుకున్న అనుబంధం, సరదా క్షణాలు కనిపించాయి. జయమ్మ పాత్ర ప్రయాణానికి ముగింపు పలికిన సందర్భం రణబలి టీమ్‌కు గుర్తుండిపోయే జ్ఞాపకంగా మారింది. రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్న, ఆర్నాల్డ్‌ వోస్లూ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. టీ-సిరీస్‌ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. దసరా పండుగ సందర్భంగా అక్టోబర్‌ 16, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సినిమా సిద్ధమవుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు అద్భుత స్పందన లభించింది. అజయ్‌–అతుల్‌ సంగీతం అందిస్తుండగా, నీరవ్‌ షా, జిష్ణు భట్టాచార్జీ ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

 

#Ranabali #RanabaliMovie #RashmikaMandanna #Rashmika #Jayamma #RashmikaJayamma #VijayDeverakonda #VijayDeverakondaRanabali #RanabaliShoot #ShootWrap #RahulSankrityan #MythriMovieMakers #TSeries #ArnoldVosloo #AjayAtul #NeeravShah #DussehraRelease #Ranabali2026 #PanIndiaMovie #TeluguCinema #MovieNews