Home Cinema_News ఆరేళ్ల నిరీక్షణకు తెర.. సెప్టెంబర్‌ 18న సందకరి

ఆరేళ్ల నిరీక్షణకు తెర.. సెప్టెంబర్‌ 18న సందకరి

ఆరేళ్లుగా విడుదల కోసం ఎదురుచూస్తున్న విమల్‌, శ్రియ శరణ్‌ జంటగా నటించిన ‘సందకరి’ ఎట్టకేలకు వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమైంది. ఆర్‌. మధేష్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ తమిళ రొమాంటిక్‌ కామెడీ చిత్రం 2026 సెప్టెంబర్‌ 18న థియేటర్లలోకి రానుంది. బాస్‌ ప్రొడక్షన్‌ కార్పొరేషన్‌ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమా షూటింగ్‌ 2019లోనే పూర్తయింది. 2020లోనే విడుదల కావాల్సి ఉన్నా.. అనివార్య కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. ఈ ఏడాది ప్రారంభంలో విడుదల కాకుండానే 2020 తమిళనాడు స్టేట్‌ ఫిల్మ్‌ అవార్డుల్లో మూడు పురస్కారాలు దక్కించుకోవడంతో ‘సందకరి’ ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. ఉత్తమ చిత్రం (మూడో బహుమతి) అవార్డును గెలుచుకోగా.. అమ్రిష్‌కు ఉత్తమ పురుష నేపథ్య గాయకుడి అవార్డు, ఇయ్యప్పన్‌కు ఉత్తమ కళా దర్శకుడి పురస్కారం లభించాయి. విడుదల కాని సినిమాకు అవార్డులు ఎలా వచ్చాయంటూ సోషల్‌ మీడియాలో చర్చ మొదలైంది. 2012లో వచ్చిన మలయాళ చిత్రం ‘మై బాస్‌’కు రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రంలో ప్రభు, సత్యన్‌, కె.ఆర్‌. విజయ, రేఖ, దేవ్‌ గిల్‌, ఉమా పద్మనాభన్‌ తదితరులు నటించారు. అమ్రిష్‌ సంగీతం అందించగా, ఆర్‌.బి. గురుదేవ్‌ ఛాయాగ్రహణం, దినేష్‌ పొన్‌రాజ్‌ ఎడిటింగ్‌ బాధ్యతలు చేపట్టారు.

 

#Sandakari #SandakariMovie #Sandakari2026 #SandakariRelease #SandakariSeptember18 #Vimal #ShriyaSaran #VimalSandakari #ShriyaSaranSandakari #RMadhesh #TamilMovies #TamilCinema #TamilMovie2026 #RomanticComedy #MyBossRemake #Amrish #TamilNaduFilmAwards #SandakariAwards #MovieNews #Kollywood