Home AP చంద్రబాబుపై నడ్డా ప్రశంసల జల్లు

చంద్రబాబుపై నడ్డా ప్రశంసల జల్లు

సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక ప్రశంస.

ఆంధ్రప్రదేశ్‌ సమగ్రాభివృద్ధికి కీలకమైన సాగునీటి ప్రాజెక్టులపై చంద్రబాబు చూపిస్తున్న చిత్తశుద్ధి, పట్టుదల అభినందనీయమని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ప్రశంసించారు. విజయవాడ పర్యటనలో మాట్లాడిన ఆయన.. పోలవరం ఎడమ కాలువ, వెలిగొండ, హంద్రీ-నీవా వంటి ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లడంలో సీఎం చేస్తున్న కృషి రాష్ట్ర భవిష్యత్‌కు ఎంతో కీలకమని అన్నారు. జలవనరులను సమర్థంగా వినియోగించుకుంటేనే అన్ని రంగాల్లో వేగవంతమైన అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌ సురక్షితమైన చేతుల్లో ఉందని నడ్డా స్పష్టం చేశారు. చంద్రబాబు దార్శనికత, నిబద్ధత కలిగిన నాయకుడని కొనియాడారు.

బయో వ్యాలీకి కేంద్రం పూర్తి అండ

అమరావతిలో ప్రతిపాదించిన క్వాంటం బయో వ్యాలీకి జాతీయ స్థాయి గుర్తింపు తీసుకురావాలన్న చంద్రబాబు ఆలోచనకు కేంద్రం సంపూర్ణ సహకారం అందిస్తుందని నడ్డా హామీ ఇచ్చారు. ప్రాజెక్టుపై మరింత అధ్యయనం కోసం త్వరలో కేంద్ర సాంకేతిక బృందాన్ని అమరావతికి పంపుతామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘సంజీవని’ కార్యక్రమాన్ని జాతీయ స్థాయిలో అమలు చేసే అవకాశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. వ్యాధులను ముందుగానే గుర్తించి నివారించడం ద్వారా ఆరోగ్యకర సమాజాన్ని నిర్మించవచ్చన్నారు. ప్రజలకు అందుబాటు ధరల్లో నాణ్యమైన వైద్యం అందించేందుకు కేంద్రం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. చంద్రబాబు చెప్పిన “వంటిల్లే ఫార్మసీ.. ఆహారమే ఔషధం” అన్న మాటలను ప్రస్తావించిన నడ్డా.. ఆరోగ్యకర జీవనశైలికి ఇదే ప్రాథమిక సూత్రమని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఏపీ మరింత ముందుకు వెళ్తుందని స్పష్టం చేశారు.

 

#JPNadda #ChandrababuNaidu #Chandrababu #APIrrigationProjects #Polavaram #PolavaramLeftCanal #VelugondaProject #HandriNeeva #AndhraPradeshDevelopment #QuantumBioValley #Amaravati #AmaravatiBioValley #SanjeevaniProgramme #APHealth #BJP #TDP #BJPTDPAlliance #APPolitics #AndhraPradeshPolitics #JPNaddaVijayawada