మెగా డీఎస్సీలో ప్రతిభతో ఉద్యోగాలు సాధించిన అభ్యర్థుల విజయాన్ని వైసీపీ నేతలు రాజకీయాల కోసం అవమానించడం దారుణమని మంత్రి రాంప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. 2018 డీఎస్సీలో తృటిలో ఉద్యోగం కోల్పోయిన అభ్యర్థులు ఏడేళ్ల పాటు పట్టుదలతో చదివి, ఎన్నో త్యాగాలు చేసి 2025 మెగా డీఎస్సీలో విజయం సాధించారని గుర్తుచేశారు. రాత్రింబవళ్లు శ్రమించిన యువత కష్టాన్ని ప్రశ్నించడం వారి కుటుంబాల త్యాగాలను అవమానించడమేనని స్పష్టం చేశారు. దరఖాస్తుల స్వీకరణ నుంచి మెరిట్ జాబితా విడుదల వరకు మెగా డీఎస్సీ ప్రక్రియను కూటమి ప్రభుత్వం పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించిందని మంత్రి తెలిపారు. మెరిట్, అర్హత ఆధారంగా ఉద్యోగాలు పొందిన వారిని వేధించడం, వారిపై ఆరోపణలు చేయడం వెంటనే ఆపాలని వైసీపీ నేతలకు హితవు పలికారు. యువత భవిష్యత్తును రాజకీయ విమర్శలకు వేదికగా మార్చొద్దని సూచించారు. ఉద్యోగం సాధించిన ప్రతి అభ్యర్థి వెనుక ఏళ్ల తరబడి సాగిన పోరాటం, కుటుంబ సభ్యుల అండ, ఎన్నో ఆశలు ఉన్నాయని పేర్కొన్నారు. అభ్యర్థుల ఆవేదనను అర్థం చేసుకుని జగన్ తన వైఖరిని మార్చుకోవాలని రాంప్రసాద్ రెడ్డి డిమాండ్ చేశారు.
#MegaDSC2025 #MegaDSC #DSC2025 #RamprasadReddy #APTeacherJobs #TeacherRecruitment #DSCCandidates #MeritCandidates #UnemployedYouth #APUnemployedYouth #DSCControversy #YSRCP #APGovernment #DSCMeritList #TeacherJobs #JobAspirants #AndhraPradesh #APPolitics #YouthJobs #EducationNews











