గీతమ్ స్నాతకోత్సవంలో పెమ్మసాని
గీతమ్ 17వ స్నాతకోత్సవం ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా డిగ్రీ అవకాశాల తలుపులు తెరిచినా, వాటిలో నిలబెట్టేది వ్యక్తిత్వం, విలువలేనని సందేశం ఇచ్చారు. యువత భవిష్యత్తును తీర్చిదిద్దే ప్రపంచస్థాయి విద్యాసంస్థగా గీతమ్ను అభివృద్ధి చేస్తున్న ఎం. శ్రీభరత్, ఆయన బృందం కృషిని ప్రశంసించారు. పట్టభద్రులు విద్యను పూర్తిచేసుకుని కొత్త జీవిత ప్రయాణంలోకి అడుగుపెడుతున్న వేళ.. స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు సాగాలని సూచించారు. కలలను కేవలం కలలుగా ఉంచకుండా వాటిని స్పష్టమైన లక్ష్యాలుగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు. లక్ష్యం ఎంత స్పష్టంగా ఉంటే విజయానికి వెళ్లే మార్గం అంత సులభంగా కనిపిస్తుందని తెలిపారు.
సవాళ్లను స్వీకరించి నాయకత్వం వహించాలి
సౌకర్యాల పరిధిలోనే ఉండకుండా కొత్త సవాళ్లను స్వీకరించాలని పట్టభద్రులకు సూచించారు. రేవులో ఓడ సురక్షితంగా ఉంటుంది.. కానీ సముద్రంలో ప్రయాణించడానికే అది నిర్మితమవుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. ఎంచుకున్న రంగంలో లోతైన పరిజ్ఞానం సంపాదించి, నైపుణ్యంతో సమాజానికి ఉపయోగపడే విలువను సృష్టించాలని సూచించారు. విజయం కేవలం మార్కులు, జీపీఏతో నిర్ణయించబడదని.. పట్టుదల, నిజాయితీ, కష్టపడే తత్వం, మార్పును స్వీకరించే ధైర్యమే అసలైన విజయానికి పునాది అని చెప్పారు. షార్ట్కట్ల కోసం ప్రయత్నించకుండా సహనంతో ముందుకు సాగాలని, మార్పు కోసం ఎదురుచూడకుండా మార్పుకు నాయకత్వం వహించా
#Pemmmasani #GITAM #GITAMConvocation #GITAMUniversity #Graduation #Convocation2026 #StudentMotivation #YouthLeadership #EmbraceChange #Success #CareerGoals #Leadership #Education #Graduates #GITAMGraduates











