‘హనుమాన్ అంశ్’ను నడిపించిన భక్తి.
ఎక్కడ మొదలై.. ఎక్కడికి చేరింది?
రూ.2 కోట్ల చిన్న సినిమా.. రూ.120 కోట్లకు పైగా వసూళ్లు! స్టార్ హీరో లేడు.. భారీ సెట్స్ లేవు.. కోట్ల రూపాయల ప్రచారం లేదు. అయినా ‘హనుమాన్ అంశ్’ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. మొదట వందల స్క్రీన్లలో మొదలైన ప్రయాణం.. షోలు భారీగా తగ్గిన దశకు చేరింది. సినిమా ఇక ముగిసిందనుకున్న సమయంలో ప్రేక్షకులే రంగంలోకి దిగారు. ఒకరి నుంచి మరొకరికి వెళ్లిన మౌత్‌టాక్.. థియేటర్లను మళ్లీ నింపింది. భక్తి, విశ్వాసం, ఆధ్యాత్మికతతో పాటు నేటి తరం ఎదుర్కొంటున్న ఒత్తిడి, ఒంటరితనం, జీవితంపై అన్వేషణకు ఈ కథ కనెక్ట్ కావడమే అసలు మలుపు. 21 ఏళ్ల యువ నిర్మాత తన పొదుపు మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టి తీసిన ఈ సినిమా.. ఇప్పుడు సీక్వెల్ దిశగా దూసుకెళ్తోంది. పెద్ద సినిమాల మధ్య చిన్న సినిమా ఇంత పెద్ద విజయం సాధించడానికి కారణమేంటి? ప్రేక్షకులు ఇందులో ఏం చూశారు? నేటి జెన్ జీకి నీమ్ కరోలి బాబా కథ ఎందుకు కనెక్ట్ అయింది? అసలు ఈ సంచలన విజయానికి దారితీసిన పరిస్థితులేంటి? ‘హనుమాన్ అంశ్’ విజయగాథ ఇప్పుడు ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెబుతోంది.
#HanumanAnsh #HanumanAnshMovie #HanumanAnshSuccess #HanumanAnshBoxOffice #Blockbuster #SmallBudgetMovie #BoxOfficeSuccess #NeemKaroliBaba #HanumanDevotion #SpiritualCinema #DevotionalMovie #GenZ #WordOfMouth #IndianCinema #TeluguCinema #YoungProducer #MovieSuccess #BoxOfficeSensation #HanumanAnshSequel #CinemaNews











