Home Sports_News కడపలో ఏపీఎల్ సందడి.. తొలి మ్యాచ్‌కు భారీ స్పందన

కడపలో ఏపీఎల్ సందడి.. తొలి మ్యాచ్‌కు భారీ స్పందన

54

ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) క్రికెట్ పోటీలకు కడపలోని వైఎస్ రాజారెడ్డి స్టేడియం వేదికగా మారింది. విజయవాడ సన్ షైనర్స్, తుంగభద్ర వారియర్స్ జట్ల మధ్య జరుగుతున్న తొలి మ్యాచ్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. మ్యాచ్ ప్రారంభానికి ముందే స్టేడియం అభిమానులతో కిక్కిరిసిపోయి క్రికెట్ పండుగను తలపించింది.

మ్యాచ్‌కు ముందు నిర్వహించిన ప్రారంభ కార్యక్రమంలో ప్రముఖ గాయని సునీత తన గానంతో ప్రేక్షకులను అలరించారు. ఆమె పాటలకు అభిమానులు ఉత్సాహంగా స్పందించారు.

తొలి మ్యాచ్‌కు బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సభ్యుడు చముండేశ్వరినాథ్ ముఖ్య అతిథిగా హాజరై టాస్ వేశారు.

టాస్ గెలిచిన విజయవాడ సన్ షైనర్స్ జట్టు ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించింది. దీంతో కడప వేదికగా ఏపీఎల్ తొలి మ్యాచ్ ఉత్సాహభరిత వాతావరణంలో ప్రారంభమైంది. ప్రేక్షకుల సందడి, సాంస్కృతిక కార్యక్రమాలు, క్రికెట్ పోటీలు కలిసి స్టేడియంలో పండుగ వాతావరణాన్ని నెలకొల్పాయి.