Home AP కూటమి రెండేళ్ళ నమ్మకం ‘విజయోత్సవ’ వేడుకలు

కూటమి రెండేళ్ళ నమ్మకం ‘విజయోత్సవ’ వేడుకలు

65

రెండేళ్లలోనే రూ.1200 కోట్ల అద్భుత ప్రగతి..

135 మహిళా సంఘాలకు రూ.20 కోట్ల బ్యాంకు రుణాలు..

సబ్సిడీ వాహనాల పంపిణీ చేసిన ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య

రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం విజయవంతంగా రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న శుభసందర్భాన్ని పురస్కరించుకుని.. చీరాల నియోజకవర్గ స్థాయి ‘రెండేళ్ళ నమ్మకం – అభివృద్ధి – సంక్షేమం’ విజయోత్సవ సభ బుధవారం అత్యంత ఘనంగా జరిగింది. స్థానిక కిరాణా మర్చంట్స్ అసోసియేషన్ కళ్యాణమండపంలో నియోజకవర్గ శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య పర్యవేక్షణలో జరిగిన ఈ ప్రగతి సభకు కూటమి నాయకులు, మహిళలు, లబ్ధిదారులు వేలాదిగా తరలివచ్చారు.

రూ.1200 కోట్ల చారిత్రాత్మక రికార్డు

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్ల స్వల్ప వ్యవధిలోనే చీరాల నియోజకవర్గ ముఖచిత్రాన్ని మార్చేలా రికార్డు స్థాయిలో నిధులు ఖర్చు చేశామని విజయోత్సవ సభలో ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య లెక్కలతో సహా వెల్లడించారు. నియోజకవర్గవ్యాప్తంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలను పారదర్శకంగా చేరవేస్తూ.. ఇప్పటి వరకు రూ.750 కోట్లు నేరుగా ప్రజల ఖాతాల్లోకి జమచేశామని తెలిపారు. అదేవిధంగా దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ఎన్నో ప్రధాన సమస్యలను పరిష్కరించేందుకు, మౌలిక వసతుల కల్పన నిమిత్తం మరో రూ.450 కోట్ల నిధులను ప్రభుత్వం నుండి మంజూరు చేయించి అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నామని సగర్వంగా ప్రకటించారు.

మహిళా సాధికారతకు ‘రూ.20 కోట్ల’ అండ

పొదుపు సంఘాల మహిళలను ఆర్థికంగా నిలబెట్టడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని చెప్తూ.. చీరాల, వేటపాలెం మండలాలకు చెందిన 135 స్వయం సహాయక సంఘాల మహిళలకు బ్యాంకు లింకేజీ ద్వారా రూ.20 కోట్ల రూపాయల చెక్కును ఎమ్మెల్యే మాలకొండయ్య చేతుల మీదుగా అందజేశారు. దీనితో పాటు ఉపాధి కల్పనలో భాగంగా ప్రభుత్వ సబ్సిడీ కింద లబ్ధిదారులకు రెండు ట్రాక్టర్లు, ఒక ఆటో, మరియు ఒక కారును ఆయన పంపిణీ చేశారు. ఈ మహాసభలో చీరాల నియోజకవర్గ అబ్జర్వర్ మరియు చిలకలూరిపేట ఏఎంసీ చైర్మన్ షేక్ కరీముల్లా , చీరాల ఏఎంసీ చైర్మన్ కౌతరపు జనార్ధన్, మాజీ మున్సిపల్ చైర్మన్ మించాల సాంబశివరావు, చేనేత నాయకులు బుచ్చేశ్వరరావు,సజ్జా హేమలత, చీరాల, వేటపాలెం మండలాల తహశీల్దార్లు గోపీకృష్ణ, గీత రాణి, ఆర్డీవో నరసింగరావు, మున్సిపల్ కౌన్సిలర్లు, పంచాయతీ ప్రతినిధులు మరియు వేలాదిగా ప్రజలు పాల్గొన్నారు.