2027 వన్డే ప్రపంచకప్ కోసం మాజీ భారత క్రికెటర్ రాబిన్ ఉతప్ప ప్రకటించిన జట్టు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీకి చోటు కల్పిస్తూ ఉతప్ప సంచలన నిర్ణయం తీసుకున్నాడు. శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ వంటి రెగ్యులర్ బ్యాటర్లను కొనసాగించినా.. యశస్వి జైస్వాల్‌కు మాత్రం స్థానం ఇవ్వలేదు. వికెట్ కీపర్‌గా ఇషాన్ కిషన్‌కు బదులుగా సంజూ శాంసన్‌ను ఎంపిక చేశాడు. రోహిత్ భవిష్యత్‌పై ప్రశ్నలు వస్తున్న సమయంలోనూ అతడిని జట్టులో కొనసాగించడం మరో ఆసక్తికర అంశంగా మారింది. బౌలింగ్‌లో జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్‌తో పాటు ఐపీఎల్లో అదరగొట్టిన భువనేశ్వర్ కుమార్‌కు మళ్లీ చోటు ఇచ్చాడు. దాదాపు ఐదేళ్లుగా భారత్ తరఫున వన్డే ఆడని భువీని ఎంపిక చేయడం కూడా సంచలనంగా మారింది. రవీంద్ర జడేజాను తిరిగి తీసుకున్న ఉతప్ప.. వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణాలను పక్కనపెట్టాడు. ఈ జట్టును ఉతప్ప “బాంబ్ స్క్వాడ్”గా అభివర్ణించాడు.
#2027WorldCup #TeamIndia #RobinUthappa #VaibhavSuryavanshi #ODIWorldCup #RohitSharma #ViratKohli #ShubmanGill #YashasviJaiswal #SanjuSamson #KLRahul #JaspritBumrah #MohammedSiraj #ArshdeepSingh #BhuvneshwarKumar #RavindraJadeja #IndianCricket #CricketNews











