Home Sports_News సచిన్ కంటే కోహ్లీ బెటరా? ఏబీ వ్యాఖ్యలపై గణేష్ సెటైర్

సచిన్ కంటే కోహ్లీ బెటరా? ఏబీ వ్యాఖ్యలపై గణేష్ సెటైర్


సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ మధ్య పోలికపై దక్షిణాఫ్రికా మాజీ స్టార్ ఏబీ డివిలియర్స్ చేసిన వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి. సీమ్, బౌన్స్ ఎక్కువగా ఉండే విదేశీ పిచ్‌లపై ఆడటంలో కోహ్లీ సచిన్ కంటే మెరుగ్గా ఉన్నాడని డివిలియర్స్ అభిప్రాయపడ్డాడు. సబ్‌కాంటినెంట్ బ్యాటర్లకు విదేశీ పరిస్థితుల్లో రాణించే మార్గాన్ని సచిన్ చూపించాడని, అయితే కోహ్లీ దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి ప్రమాణాలను పెంచాడని ఆయన చెప్పాడు. సచిన్ తన కాలంలో మార్గదర్శకుడిగా నిలిచినా, విదేశీ పరిస్థితుల్లో కోహ్లీ మరింత బలమైన బ్యాటర్ అని డివిలియర్స్ పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్యలపై మాజీ భారత ఫాస్ట్ బౌలర్ దొడ్డ గణేశ్ మాత్రం ఘాటుగా స్పందించాడు. ఏదో యథాలాపంగా అన్నావులే అంటూ ఎక్స్‌లో పెట్టిన ఆయన పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

 

#ViratKohli #SachinTendulkar #ABDeVilliers #DoddaGanesh #KohliVsSachin #IndianCricket #CricketDebate #ViratKohliNews #SachinNews #ABDeVilliersComments #DoddaGaneshReaction #CricketNews #TeamIndia