తెలంగాణ కాంగ్రెస్‌లో ఇప్పుడొకటే టాపిక్.. కొండా సురేఖపై సొంత పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఫైర్. సీఎం రేవంత్‌రెడ్డిపై కొండా సురేఖ కుమార్తె సుశ్మిత చేసిన వ్యాఖ్యలు పార్టీలో చిచ్చు పెట్టాయి. ఏకంగా 18 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒక్కటై సుశ్మిత వ్యాఖ్యలను ఖండించడంతో వ్యవహారం మామూలు రచ్చగా మిగల్లేదు. “సీఎంను టార్గెట్ చేస్తే ఊరుకునేది లేదు.. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే చర్యలు తప్పవు” అంటూ నేతలు గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. కొందరైతే కొండా సురేఖ కూడా దీనిపై స్పష్టంగా స్పందించి, అవసరమైతే పార్టీ నుంచి తప్పుకోవాలంటూ డిమాండ్ చేసే స్థాయికి వెళ్లారు. మరోవైపు సురేఖ మాత్రం “చెప్పాల్సిందంతా క్రమశిక్షణ కమిటీకి చెప్పా.. కొత్తగా చెప్పేదేమీ లేదు” అంటూ మీడియాకు గేట్లు మూసేశారు. సీఎం విదేశీ పర్యటన నుంచి వచ్చాక మాట్లాడతానని చెప్పి సస్పెన్స్ పెంచారు. ఈ మొత్తం ఎపిసోడ్‌పై సీపీఐ నేత కె. నారాయణ తనదైన శైలిలో “కాంగ్రెస్‌లో సవతుల పోరు నడుస్తోంది” అంటూ సెటైర్ వేశారు. ఇంటిపోరు ఇలాగే కొనసాగితే బీఆర్ఎస్ మళ్లీ పుంజుకునే ఛాన్స్ ఉందంటూ జోస్యం చెప్పారు. దీంతో అటు సురేఖ వైఖరి.. ఇటు సొంత పార్టీ నేతల డిమాండ్లు.. మధ్యలో నారాయణ సెటైర్లు.. తెలంగాణ కాంగ్రెస్‌లో అసలు కథ ఇప్పుడే మొదలైందా? అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా నడుస్తోంది.
#KondaSurekha #TelanganaCongress #RevanthReddy #SusmithaPatel #CongressCrisis #CongressInfighting #TelanganaPolitics #CongressMLAs #CongressMLCs #KondaSurekhaControversy #KNRarayana #BRS #PoliticalCrisis











