Home Crime_News నాగ్‌పూర్‌లో ఘోరం – వాయుసేన అధికారి భార్యపై అత్యాచారం

నాగ్‌పూర్‌లో ఘోరం – వాయుసేన అధికారి భార్యపై అత్యాచారం

12

బలవంతపు మతమార్పిడి
నిందితుల అరెస్ట్, పోలీసుల వేట

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో అత్యంత దిగ్భ్రాంతికరమైన ఘటన వెలుగుచూసింది. ఇండియన్ ఆర్మీ అధికారి భార్యపై పాత క్లాస్‌మేట్, అతని స్నేహితులు కలిసి అత్యాచారం, బ్లాక్‌మెయిల్, క్షుద్రపూజలు, బలవంతపు మతమార్పిడికి పాల్పడ్డారు. ఈ దారుణానికి సంబంధించిన కేసులో నాగ్‌పూర్ పోలీసులు ప్రధాన నిందితుడు అయాజ్ మదారేతో పాటు అతని అనుచరుడు అమీన్ షేక్‌ను అరెస్ట్ చేశారు. ఈ నేరంలో భాగస్వామి అయిన ఒక మత గురువు (మౌలానా) కోసం పోలీసులు ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో గాలింపు చర్యలు చేపట్టారు.

మత్తుమందు ఇచ్చి అశ్లీల చిత్రాల చిత్రీకరణ
బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా నమోదైన ఎఫ్ఐఆర్ ప్రకారం, 2025 ఫిబ్రవరి 8న ఒక హోటల్‌లో కలిసినప్పుడు అయాజ్ ఆ 24 ఏళ్ల మహిళ తాగే పానీయంలో మత్తుమందు కలిపాడు. ఆమె స్పృహ కోల్పోయిన తర్వాత ఆమెకు సంబంధించిన అశ్లీల ఫోటోలు, వీడియోలను రికార్డ్ చేశాడు. ఆ దృశ్యాలను ఆమె భర్తకు పంపుతానని, సామాజిక మాధ్యమాలలో అప్‌లోడ్ చేస్తానని బెదిరిస్తూ బ్లాక్‌మెయిల్‌కు పాల్పడ్డాడు. ఈ భయంతో ఆమె నుండి సుమారు 4 లక్షల రూపాయల డబ్బును వసూలు చేయడమే కాకుండా పలుమార్లు లైంగిక దాడికి ఒడిగట్టాడు.

వైరల్ వీడియో ఆధారంగా దర్యాప్తు
ఈ కేసులో సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియో కీలక సాక్ష్యంగా మారింది. ఆ వీడియోలో బాధితురాలు ఏడుస్తూ, తన్ను వదిలేయమని నిందితుడు అయాజ్ మదారేను వేడుకోవడం కనిపిస్తుంది. నిందితుడు ఆమె చేతులను బలవంతంగా పట్టుకుని, కొన్ని మంత్రాలు చదువుతూ ఆమె ముఖంపై ఊదడం ఆ వీడియోలో ఉంది. క్షుద్రపూజలు, హిప్నాసిస్ ద్వారా తనను లొంగదీసుకుని అత్యాచారం చేసేవాడని బాధితురాలు పేర్కొంది. ఏదో ఒక ద్రవాన్ని బలవంతంగా తాగించి ఈ దారుణాలకు ఒడిగట్టేవాడని ఆమె కన్నీరుమున్నీరైంది.

బలవంతపు నికా, మాంసం తినిపించడం
మే 31న నిందితులు ఆమెను బలవంతంగా కల్మేశ్వర్ ప్రాంతానికి తీసుకువెళ్లారు. అక్కడ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన హజ్రత్ మౌలానా అనే వ్యక్తితో బలవంతంగా మతపరమైన పూజలు చేయించారు. ఆమె ఇష్టానికి విరుద్ధంగా ‘ఖుబూల్ హై’ అని చెప్పించి మతమార్పిడి చేశారు. అనంతరం ఆమెకు బలవంతంగా మాంసం తినిపించి, కలమా చదివించారు. ఆ తర్వాత అయాజ్‌తో ఆమెకు ‘నికా’… పెళ్లి జరిగిపోయిందని సదరు మౌలానా ప్రకటించాడు. అక్కడ నుండి ఆమెను మళ్లీ ఒక హోటల్‌కు తరలించి అయాజ్ అత్యాచారానికి పాల్పడ్డాడు.

పోలీసుల కఠిన చట్టాల ప్రయోగం
ఈ ఘోరకలిని నిరోధించడానికి నాగ్‌పూర్ పోలీసులు నిందితులపై అత్యాచారం, బ్లాక్‌మెయిల్, బలవంతపు మతమార్పిడి చట్టాలతో పాటు క్షుద్రపూజల నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేశారు. నిందితుల నుండి స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను ల్యాబ్‌కు పంపినట్లు డీసీపీ సురేష్ రెడ్డి తెలిపారు. ఈ కేసులో సాంకేతిక ఆధారాలు అత్యంత కీలకమని, పరారీలో ఉన్న మౌలానాను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.