Home General 300 అడుగుల తిరంగా యాత్ర దేశభక్తితో మార్మోగిన చీరాల వీధులు

300 అడుగుల తిరంగా యాత్ర దేశభక్తితో మార్మోగిన చీరాల వీధులు



స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా చీరాలలో దేశభక్తి వెల్లివిరిసింది. బీజేపీ, భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో శ్రీ మేధావి కాలేజీ, టెక్నో భారతి డిగ్రీ కాలేజీ సహకారంతో 300 అడుగుల జాతీయ జెండాతో తిరంగా యాత్ర నిర్వహించారు. విద్యార్థులు, యువత భారీ జెండాను పట్టుకుని పట్టణ వీధుల్లో ప్రదర్శన నిర్వహించగా ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల ఫలితంగానే దేశానికి స్వేచ్ఛ లభించిందని బీజేపీ నేతలు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరిలో దేశభక్తి పెరగాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో అల్లర్లు, విధ్వంసానికి ప్రయత్నించే అసాంఘిక శక్తుల కుట్రలను తిప్పికొట్టేందుకు ప్రజలంతా ఐక్యంగా నిలవాలని పిలుపునిచ్చారు. యువతలో జాతీయ భావాలను పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని నిర్వాహకులు తెలిపారు.

 

#TirangaYatra #Chirala #300FootTiranga #IndependenceDay #BJP #BJYM #NationalFlag #Patriotism #Youth #Students #IndependenceDayCelebrations #ChiralaNews #IndianFlag #Tiranga #India