Home General ఘనంగా చౌడేశ్వరి దేవి బోనాల 11వ వార్షికోత్సవం

ఘనంగా చౌడేశ్వరి దేవి బోనాల 11వ వార్షికోత్సవం


దేవాంగుల కులదేవతకు ఘనంగా బోనాల సమర్పణ

మంగళగిరిలో దేవాంగుల కులదేవత శ్రీశ్రీ చౌడేశ్వరి దేవి బోనాల 11వ వార్షికోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. కొప్పురావు కాలనీ 5వ లైనులోని అల్లక నమశ్శివాయ నివాసం వద్ద ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోనాల సమర్పణ అనంతరం కనకతప్పెట్లు, మేళతాళాలు, భాజాభజంత్రీల నడుమ అమ్మవారి ఊరేగింపు సాగింది. రాజీవ్ సెంటర్, మిద్దె సెంటర్, గాలిగోపురం మీదుగా వెంకటేశ్వరస్వామి ఆలయం, గండాలయ్యపేటలోని తోతాద్రి పోలేరమ్మ ఆలయం వరకు ఊరేగింపు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. కోలాట నృత్యాలు, విచిత్ర వేషధారణలు, సన్నాయి మేళాలు, తీన్మార్‌ ప్రదర్శనలు, వివిధ వాద్య బృందాల కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. బాణాసంచా కాల్పులతో ఉత్సవ ప్రాంగణం సందడిగా మారింది. రాత్రి భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. మహిళలు, చిన్నారుల ప్రత్యేక ప్రదర్శనలు ఉత్సవానికి మరింత శోభను తీసుకొచ్చాయి. పెద్ద సంఖ్యలో దేవాంగులు, భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం ప్రతినిధులు, అర్చకులు, వివిధ ప్రాంతాల దేవాంగ సంఘాల నాయకులు, కార్యవర్గ సభ్యులు ఉత్సవంలో పాల్గొన్నారు.

#ChowdeshwariDevi #ChowdeshwariDeviBonalu #Mangalagiri #Devanga #DevangaCommunity #Kuladevatha #Bonalu #BonaluFestival #MangalagiriFestival #DevotionalNews #AndhraPradesh #ReligiousFestival #ChowdeshwariDeviUtsavam #APNews