05.07.2026-11.07.2026 వరకు రాశి ఫలితాలు

Weekly Horoscope (July 5–11, 2026): Zodiac-Wise Predictions for All 12 Signs

121

05.07.2026-11.07.2026 వరకు రాశి ఫలితాలు

1. మేష రాశి

విద్యార్థులకు అనుకూలమైన కాలం. ఉద్యోగస్తులు లౌక్యంగా మెలగాలి. అప్పు చేయాల్సిన పరిస్థితి రావచ్చు. నిరుద్యోగులు ఇంటర్వ్యూలో టెన్షన్ పడకుండా సమాధానాలు చెప్పాలి. స్త్రీలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. అన్ని రంగాల్లో ఉన్న మేష రాశి వారికి ప్రయాణానికి ఆస్కారం ఉంది. ఆరవ తేదీ సోమవారం సాయంకాలం నుంచి ఏడవ తేదీ మంగళవారం సాయంత్రం నాలుగు గంటల వరకు ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవడం మంచిది. ప్రస్తుత గ్రహదోష పరిహారార్థం దైవానికి దీపం వెలిగించి ఒక పుష్పం సమర్పించి నమస్కారం చేసుకోండి. నృసింహస్వామి దర్శనం, హనుమాన్ దండకం పారాయణం మేలు చేస్తాయి.

2. వృషభ రాశి

విద్యార్థులు మంచి యూనివర్సిటీల్లో సీటు పొందేందుకు ఆస్కారం ఉంది. ఉద్యోగస్తులకు ఆర్థిక వృద్ధి ఉంటుంది. తండ్రి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. నిరుద్యోగులకు ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగస్తులు అధికారులతో వినయంగా ప్రవర్తించాలి. వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో సఖ్యత పెంచుకోవాలి. వాహన సౌఖ్యానికి ఆస్కారం ఉంది. జ్వర సంబంధిత అనారోగ్యానికి అవకాశం ఉన్నందున శరీరాన్ని చల్లబరిచే పదార్థాలు తీసుకోవడం మరవద్దు. సూర్య నమస్కారాలు చేస్తూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయించండి. కందిపప్పు దానం చేయడం వల్ల గ్రహదోష తీవ్రత తగ్గుతుంది.

3. మిథున రాశి

వీరికి ఆరోగ్యం సామాన్యంగానే ఉంటుంది. ఉద్యోగస్తులు పౌరుషానికి పోకుండా పరిస్థితులకు అనుగుణంగా మెలగడం మంచిది. ఆర్థికంగా సర్దుబాట్లు అవుతాయి. ఆర్థికంగా ఇబ్బందులుండవు. గృహిణులకు పని భారం పెరుగుతుంది. ఓర్పుగా ఉన్నప్పటికీ అవమానాలను ఎదుర్కొనే అవకాశం ఉంది. స్త్రీలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ప్రభుత్వ ఉద్యోగులకు ఏసీబీ బెడద ఉండవచ్చు. అన్ని రంగాల్లో ఉన్న వారికి 9, 10 తేదీలు అనుకూలం. ప్రస్తుత గ్రహదోష తీవ్రత తగ్గేందుకై.. సూర్య నమస్కారాలు చేయడం, సూర్య ద్వాదశ నామాలు పారాయణం చేయడం, గోధుమలు దానం చేయడం, రాజుల దర్శనం మేలు చేస్తాయి.

4. కర్కాటక రాశి

విద్యార్థులకు మీరు అనుకున్న యూనివర్సిటీల్లో సీటు వచ్చే అవకాశం ఉంది. స్త్రీలకు కొంత శ్రమ పెరిగినా సంతోషంగానే ఉంటారు. ఉద్యోగస్తులకు సామాన్యంగా ఉంటుంది. రక్త సంబంధీకులతో ప్రేమ పెరుగుతుంది. మనకు కనబడే దైవం తండ్రి కూడా కాబట్టి వారి పాదాలకు ఉదయాన్నే నమస్కారం చేసుకోండి. సూర్యగ్రహ దోష తీవ్రత తగ్గుతుంది. భార్య అనుకూలత, ఆర్థిక పుష్టి ఉంటుంది. 11వ తేదీ శనివారం ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. గణపతిని ఆరాధించడం, గణపతికి గుంజిళ్లు తీయడం వల్ల గ్రహదోష తీవ్రత తగ్గును.

5. సింహ రాశి

ఉద్యోగస్తులు అనుకున్న ప్రాంతాలకు బదిలీ అయ్యేందుకు గ్రహస్థితి అనుకూలంగా ఉంది. విద్యార్థులకు మంచి కాలం. ప్రజా జీవితంలో ఉన్న వారికి పదవీ ప్రాప్తికి ఆస్కారం ఉంది. తల్లిదండ్రుల సహకారం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులకు ఆశాజనకంగా ఉంటుంది. భార్య ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. 6, 7, 8 తేదీల్లో ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవడం మంచిది. వివాహాది శుభకార్యాల్లో పేరు, ప్రఖ్యాతలు పొందే గ్రహస్థితి ఉంది. వృద్ధులకు పెరుగన్నం పెట్టండి. హనుమంతుని ఆరాధించండి. శనివారం నవగ్రహాలయానికి వెళ్లి 21 ప్రదక్షిణాలు చేయండి.

6. కన్యా రాశి

వ్యాపారస్తులకు లాభదాయకమైన వారం. ఉద్యోగస్తులు అధికారుల మన్ననలు పొందుతారు. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లకు ఆస్కారం ఉంది. రక్త సంబంధీకుల బాధ్యతను మీరు నిర్వర్తిస్తూ సఖ్యతగా మెలగండి. వివాహాది శుభకార్యాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అవకాశం ఉంది. స్త్రీలకు భక్తి పెరుగుతుంది. వ్యవసాయదారులకు అనుకూల గ్రహస్థితి ఉంది. 9, 10 తేదీల్లో ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవడం మంచిది. నరసింహస్వామిని దర్శించండి. నిద్ర లేవగానే బంగారానికి నమస్కరించండి. గోమాత పూజ సకల గ్రహదోషాలను హరిస్తుంది.

7. తులా రాశి

విద్యార్థులు ఆశించిన కాలేజీలో అనుకున్న బ్రాంచ్‌లో సీటు రాకపోవచ్చు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ తండ్రి ఆశీస్సులు తీసుకోండి. వ్యాపారస్తులకు రాని బాకీల బెడద ఉంటుంది. ఉద్యోగస్తులు సహచరులతో సఖ్యతగా ఉండాలి. వ్యవసాయదారులకు పనులు ఆలస్యంగా మొదలవుతాయి. డ్రైవింగ్‌లో జాగ్రత్త వహిస్తూ వాహన సంబంధిత పత్రాలు సరిచూసుకోండి. స్నేహితులతో కొంత దూరం పెట్టడం మంచిది. మీ ఆరోగ్యం, భార్య ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ ప్రతినిత్యం సూర్య నమస్కారాలు చేయండి. ప్రభుత్వ ఉద్యోగులకు ఏసీబీ బెడద ఉండే అవకాశం ఉంది. 9, 10 తేదీలు అనుకూలం. గోధుమలు దానం చేయండి లేదా గోమాతకు తినిపించండి. కందిపప్పు దానం చేయండి. వీధి కుక్కలకు ఆహారం పెట్టండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించడం మంచిది.

8. వృశ్చిక రాశి

ఉద్యోగస్తులకు పని భారం పెరుగినా… అధికారుల గుర్తింపు లేకపోయినా భావావేశానికి లోనుకాకపోవడం మంచిది. అన్ని రంగాల్లో ఉన్నవారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. అత్యవసరమైతేనే ప్రయాణాలు చేయండి. రాత్రి ప్రయాణాలు చేయకపోవడం మేలు. జీవిత భాగస్వామితో ఓర్పుగా మెలగాలి. అప్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. విద్యార్థులు గణపతి అనుగ్రహం పొందాలి. తండ్రితో నిదానంగా మాట్లాడుతూ వారి ఆశీస్సులు తీసుకోండి. విజయం మీదే. ప్రతినిత్యం సూర్య నమస్కారాలు చేయండి. రాజుల దర్శనం వల్ల కూడా గ్రహదోష తీవ్రత తగ్గుతుంది. భాగస్వామ్య వ్యాపారస్తుల మధ్య పారదర్శకత అవసరం. సూర్యుడు, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన గ్రహదోష తీవ్రతను తగ్గిస్తుంది.

9. ధనుస్సు రాశి

విద్యార్థులు కాలభైరవ అష్టకాన్ని భక్తిశ్రద్ధలతో పారాయణం చేస్తే లక్ష్యాలను సాధించే అవకాశం ఉంటుంది. ఇంట్లో ఉన్న తాతయ్య, బామ్మ పాదాలకు నమస్కరించండి. గ్రహదోష తీవ్రత తగ్గుతుంది. ఉద్యోగస్తులకు పని భారం అధికంగా ఉంటుంది. ఆర్థిక సర్దుబాట్లు చేయాల్సి వస్తుంది. “నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది” అనే సామెత ప్రస్తుతం ఈ రాశి వారికి వర్తిస్తుంది. ఖర్చులు తగ్గించుకోవాలి. అకాల భోజనానికి ఆస్కారం ఉండాలి. మిత్రులు, బంధువులతో సఖ్యత పెంచుకోవాలి. గృహిణులకు పని భారం పెరుగుతుంది. మార్కెటింగ్ రంగంలో ఉన్నవారు ఓర్పు పెంచుకోవాలి. వ్యాపారస్తులు ప్రతిరోజూ లక్ష్మీ చతుర్వింశతి నామాలను కనీసం 11 సార్లు పారాయణం చేసి పాయసం నివేదించండి.

10. మకర రాశి

అన్ని రంగాల్లో ఉన్న వారికి శ్రమ పెరుగుతుంది. యుక్తవయస్సులో ఉన్నవారికి కూడా శరీరంలో బడలిక కనిపిస్తుంది. చాదస్తం పెరుగుతుంది. జీవిత భాగస్వామి అనుకూలంగా ఉంటారు. ఉద్యోగస్తులకు శ్రమకు తగిన ఆదాయం ఉంటుంది. విద్యార్థులకు మంచి కాలేజీలో సీటు రావాలంటే దక్షిణామూర్తిని ఆరాధిస్తూ కాలభైరవుడిని కూడా ఆరాధించండి.

11. కుంభ రాశి

ప్రజా జీవితంలో ఉన్నవారికి మానసిక ఒత్తిడి పెరుగుతుంది. విద్యార్థులు గణపతి షోడశ నామాలను ప్రతిరోజూ కనీసం 11 సార్లు పారాయణ చేసి బెల్లం ముక్కను నివేదించండి. మీ మనోవాంఛ నెరవేరే అవకాశం ఉంటుంది. అనవసర ప్రయాణాలు చేయవద్దు. భూ లావాదేవీలు వాయిదా వేయడం మంచిది. అధిక వడ్డీకి అప్పులు చేసే పరిస్థితిని ఎలా అధిగమించాలో ఆలోచించండి. రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పారాయణం చేయండి. కందిపప్పు దానం చేయండి. మీ బంధువుల్లో ఉన్న కన్య చేతులకు గోరింటాకు పెట్టండి. గ్రహదోష తీవ్రత తగ్గుతుంది. ప్రభుత్వ ఉద్యోగులపై అధికారుల ఒత్తిడి ఉంటుంది. తండ్రి ప్రేమ, అనురాగాలను పొందేందుకు ప్రయత్నించండి. అన్ని రంగాల్లో ఉన్నవారు ఓర్పును కొనసాగించండి. ముందు ముందు అన్ని మంచి రోజులే.

12. మీన రాశి

బంధువుల్లో ఆదరణ పెరుగుతుంది. రాని బాకీలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు కోరుకున్న ప్రాంతానికి బదిలీ అయ్యే అవకాశం ఉంది. వారసత్వ ఆస్తులు రావచ్చు. భార్య నుంచి రావాల్సిన ఆస్తి కూడా వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులకు అనుకూల కాలం. వ్యవసాయదారులకు ఆశాజనకంగా ఉంటుంది. పుణ్యక్షేత్ర దర్శనానికి అవకాశం ఉంది. అన్ని రంగాల్లో ఉన్న మీన రాశి వారికి మంచి కాలం నడుస్తోంది. శనివారం రుద్రాభిషేకం చేయించండి. పేదలకు ఆహారం పెట్టండి. ఏలినాటి శని గ్రహదోష తీవ్రత తగ్గింది. మీ ఇంట్లో ఉన్న తాతయ్య, బామ్మకు సేవ చేసి వారి ఆశీస్సులు తీసుకోండి. గ్రహదోష తీవ్రత తగ్గుతుంది. 6, 7, 8 తేదీలు అనుకూలం.

టీటీడీ అనుబంధ సంస్థ సమరసత సిద్ధాంతి
‘దైవజ్ఞ’ పులిపాక చంద్రశేఖర శర్మ, శ్రీ చక్ర పంచాంగ కర్త
సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్: +91 94407 83005