Home AP ఉప్పాడ తీరానికి రక్షణ ఐఐటీ మద్రాస్‌తో ఒప్పందం

ఉప్పాడ తీరానికి రక్షణ ఐఐటీ మద్రాస్‌తో ఒప్పందం


సముద్ర కోతకు చెక్.. రక్షణ గోడ.

సముద్ర కోతతో ఏళ్లుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న కాకినాడ జిల్లా ఉప్పాడ తీరానికి శాశ్వత రక్షణ కల్పించే దిశగా ప్రభుత్వం కీలక అడుగు వేసింది. తీర రక్షణ గోడ నిర్మాణానికి ఐఐటీ మద్రాస్‌తో అవగాహన ఒప్పందం కుదిరింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. రూ.323 కోట్లతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ నోడల్ ఏజెన్సీగా, ఏపీ మారిటైమ్ బోర్డు అమలు సంస్థగా వ్యవహరించనున్నాయి. తీర కోత తీవ్రత, సముద్ర ప్రవాహాలు, అలల ప్రభావాన్ని ఐఐటీ మద్రాస్ నిపుణులు అధ్యయనం చేసి రక్షణ గోడ డిజైన్‌తో పాటు సమగ్ర ప్రాజెక్టు నివేదికను రూపొందించనున్నారు. నిర్మాణ పనులపై సాంకేతిక పర్యవేక్షణ కూడా చేపట్టనున్నారు. కేంద్ర విపత్తు నిర్వహణ నిధుల ఆమోదంతో ప్రాజెక్టు ముందుకు సాగనుంది. నవంబర్‌ నుంచి పనులు ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుతో ఉప్పాడ తీర గ్రామాలు, మత్స్యకార కుటుంబాల నివాసాలు, జీవనోపాధికి రక్షణ లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.

 

#Uppada #UppadaCoast #UppadaSeaErosion #CoastalProtection #UppadaSeaWall #IITMadras #PawanKalyan #Kakinada #KakinadaDistrict #AndhraPradesh #CoastalErosion #SeaErosion #APMaritimeBoard #DisasterManagement #APDevelopment #CoastalProtectionProject