Home AP చీరాలలో నేతన్నల సతమతం మగ్గం ఆగితే.. రాజకీయాలు మారతాయ్!

చీరాలలో నేతన్నల సతమతం మగ్గం ఆగితే.. రాజకీయాలు మారతాయ్!


వైసీపీతోనే భవిష్యత్ అంటున్న మనోగతం

చీరాలలో మగ్గం చప్పుడు మందగించింది. నూలు అల్లే చేతుల్లో నిస్పృహ పెరిగింది. ఎన్నికల వేళ వినిపించిన హామీలు ఇప్పటికీ అమలు కాకపోవడంతో చేనేత కుటుంబాల్లో అసంతృప్తి రోజురోజుకూ పెరుగుతోంది. రూ.25 వేల సాయం కాదు.. మూడేళ్ల బకాయిలతో కలిపి రూ.75 వేల ఆర్థిక సహాయం ఇవ్వాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ఒకప్పుడు నేతన్న నేస్తం, ఆప్కో బలోపేతం, ప్రత్యక్ష ఆర్థిక సాయంతో అండగా నిలిచిన వైఎస్సార్సీపీ పాలనను ఇప్పుడు చాలామంది నేతన్నలు గుర్తు చేసుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో చేనేత సమస్యలపై గళం విప్పుతున్న కరణం వెంకటేష్ బాబు, తండ్రి కరణం బలరామకృష్ణమూర్తి వారసత్వాన్ని కొనసాగిస్తూ నేతన్నల మధ్యకు రావడం చీరాల రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. మగ్గం బతికితేనే చీరాల బతుకుతుందనే నమ్మకం ఉన్న ఈ నేలలో, చేనేత సంక్షేమమే మళ్లీ ప్రధాన రాజకీయ అజెండాగా మారుతోంది. ప్రస్తుతం చీరాలలో మారుతున్న సమీకరణాలు చేనేత చుట్టూనే తిరుగుతున్నాయి. ప్రభుత్వాల వైఫల్యాలపై పెరుగుతున్న అసంతృప్తి, ఉపాధి సంక్షోభం, పెరిగిన ఉత్పత్తి ఖర్చులు, తగ్గిన ఆదాయం నేతన్నలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇలాంటి సమయంలో చేనేతకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని వైఎస్సార్సీపీ నేతలు ప్రకటిస్తున్నారు. మగ్గం వద్ద మొదలైన అసంతృప్తి రానున్న రోజుల్లో చీరాల రాజకీయాల దిశను మార్చే శక్తిగా మారుతుందా అనే ప్రశ్న ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.

 

#Chirala #Weavers #Handloom #AndhraPradesh #HandloomCrisis #WeaversWelfare #ChiralaPolitics #YSRCP #KaranamVenkateshBabu #APCO #TextileIndustry #HandloomWorkers #AndhraPolitics #ChiralaNews #BreakingNews