- రామకృష్ణాపురం క్యాంప్ కార్యాలయంలో ఘనంగా పోస్టర్ ఆవిష్కరణ
- నిర్భయంగా అభిప్రాయాలు పంచుకునేందుకు చక్కని వేదిక
చీరాల, జులై 17 (నాదేశం):
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులను ఒకే డిజిటల్ వేదికపైకి తీసుకురావాలనే ఉన్నత లక్ష్యంతో పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ‘‘జగన్ 2.0 సూపర్ యాప్’’ పోస్టర్‌ను చీరాలలో ఆవిష్కరించారు. చీరాల మండలం రామకృష్ణాపురంలోని వైఎస్సార్‌సీపీ క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కరణం వెంకటేష్ ఈ పోస్టర్‌ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా కరణం వెంకటేష్ బాబు మాట్లాడుతూ.. పార్టీ కోసం అహర్నిశలు శ్రమించే ప్రతి కార్యకర్త తన మనసులోని అభిప్రాయాలను, సూచనలను ఎలాంటి భయం లేకుండా నేరుగా అధిష్ఠానానికి చెప్పేందుకు ఈ యాప్ ఒక అద్భుతమైన వేదికగా నిలుస్తుందన్నారు. పార్టీ నాయకత్వంతో ప్రతి ఒక్కరూ నిరంతరం అనుసంధానమై ఉండేందుకు, సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంచుకునేందుకు ఈ సాంకేతికత ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. కావున నియోజకవర్గ పరిధిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా శ్రేణులు మరియు అభిమానులు ప్రతి ఒక్కరూ ఈ యాప్‌ను తక్షణమే డౌన్‌లోడ్ చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చీరాల నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గవిని శ్రీనివాసరావు,వాసిమళ్ల వాసు, కంపా అరుణ్, బాలకృష్ణ, చెల్లి బాబురావు తదితరులు పాల్గొన్నారు.
#YSRCP #Jagan20 #Jagan20SuperApp #YSJaganMohanReddy #KaranamVenkatesh #Chirala #AndhraPradeshPolitics #YSRCongress #PartyApp #DigitalPolitics #PoliticalUpdate #PartyCadre #PoliticalNews #BreakingNews #LatestNews #TeluguNews #YSRCPNews #Jagan #ChiralaNews #APPolitics











