Home National_news 20 నుంచి పార్లమెంట్‌ సమావేశాలు సభకు ఈసారి ఐదు కొత్త బిల్లులు

20 నుంచి పార్లమెంట్‌ సమావేశాలు సభకు ఈసారి ఐదు కొత్త బిల్లులు

47



పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు జులై 20 నుంచి ఆగస్టు 13 వరకు జరగనున్నాయి. ఈ సమావేశాల బిజినెస్‌ జాబితాను సెక్రటరీ జనరల్‌ ఉత్పల్‌ కుమార్‌ సింగ్‌ విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం ఐదు కొత్త బిల్లులను ప్రవేశపెట్టనుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 33 నుంచి 37కు పెంచే సవరణ, ఆదాయపు పన్ను చట్టంలో మార్పులు, విదేశీ విరాళాల నియంత్రణ చట్ట సవరణ, వికసిత్‌ భారత్‌ శిక్షా అధిష్ఠాన్‌ బిల్లు, జనన–మరణాల నమోదు నిబంధనల సవరణలు కీలకంగా ఉండనున్నాయి. జాతీయ గౌరవ పరిరక్షణ చట్టంలో మార్పులతో పాటు ఎంఎస్‌ఎంఈ రంగానికి సంబంధించిన కొత్త బిల్లులను కూడా ప్రభుత్వం తీసుకురానుంది. 2022–23 అదనపు వ్యయాలపై లోక్‌సభలో ఓటింగ్‌ నిర్వహించనున్నారు.