Home Crime_News ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి.

ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి.

48
warangal cp


-వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్, ఐపిఎస్.

ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని వరంగల్ పోలీస్ కమిషనర్ గారు తెలిపారు. ప్రతి సోమవారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయం నందు నిర్వహించే ప్రజా ఫిర్యాదులను కార్యక్రమంలో కమిషనరేట్ నలుమూలల నుండి ఫిర్యాదుదారులు తమ సమస్యలను పోలీస్ కమిషనర్ గారికి స్వయంగా తెలియజేశారు. సమస్యలను విన్న పోలీస్ కమిషనర్ గారు సంబంధిత పోలీసు అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలు ఇచ్చి శాశ్వత పరిష్కారాలు చూపాలని, బాధితుల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తెలిపారు. ప్రజల సమస్యలను పరిష్కరించినప్పుడు పోలీసుల పట్ల నమ్మకం పెరుగుతుందని తెలిపారు. ఈరోజు పోలీసు ముఖ్య కార్యాలయంలో దాదాపు 10 ఫిర్యాదులను సేకరించడం జరిగింది. వచ్చిన ఫిర్యాదులలో కుటుంబ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, కేసుల పురోగతి, భూ సమస్యలు, తదితర విషయాలు ఉన్నట్లు సీపీ తెలిపారు. కమిషనరేట్ వ్యాప్తంగా అసాంఘిక కార్యకలాపాలపై ఎలాంటి సమాచారం ఉన్న +91 8712685257 నంబర్ కు వాట్సప్ ద్వారా తెలియజేయాలని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని పోలీస్ కమిషనర్ తెలిపారు.