Home AP అమరావతి ఛాంపియన్‌షిప్‌లో మెరిసిన వేంపల్లె జెడ్పీ బాలుర పాఠశాల విద్యార్థులు..

అమరావతి ఛాంపియన్‌షిప్‌లో మెరిసిన వేంపల్లె జెడ్పీ బాలుర పాఠశాల విద్యార్థులు..

జిల్లా స్థాయికి ఆరుగురు ఎంపిక.


పులివెందుల నియోజకవర్గంలో నిర్వహించిన అమరావతి ఛాంపియన్‌షిప్ క్రీడా పోటీల్లో వేంపల్లె తలిశెట్టి సుబ్రహ్మణ్యం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ చాటారు.అండర్-17 బాలుర వాలీబాల్ ఎంపిక పోటీల్లో పాల్గొన్న వి. గురుచరణ్, పి. విష్ణుచరణ్, బి. అజయ్, ఎస్. యాకూబ్, పి. నాయబ్ రసూల్ జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. అలాగే లాంగ్ జంప్ విభాగంలో ఎల్. ఆనంద్ కూడా జిల్లా స్థాయి పోటీలకు అర్హత సాధించారు.జిల్లా స్థాయికి మొత్తం ఆరుగురు విద్యార్థులు ఎంపిక కావడం పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ విజయానికి కృషి చేసిన ఫిజికల్ డైరెక్టర్లు నిషాల్, ప్రమీల కుమారిలను ప్రధానోపాధ్యాయులు ప్రత్యేకంగా అభినందించారు.జిల్లా స్థాయి పోటీల్లో కూడా విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చి పాఠశాలకు, వేంపల్లెకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.