భారతరత్న, మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా వేంపల్లెలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఏపీసీసీ మీడియా ఛైర్మన్ డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి మాట్లాడుతూ… అబ్దుల్ కలాం జీవితం ప్రతి యువకుడికి ఆదర్శప్రాయమని అన్నారు. “కలలు కనండి… వాటిని సాకారం చేసుకోండి” అనే కలాం సందేశం దేశ యువతకు దిశానిర్దేశం చేసిందని పేర్కొన్నారు.
సామాన్య కుటుంబంలో జన్మించిన ఓ పేపర్ బాయ్ తన ప్రతిభ, కృషితో ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తగా, భారత రాష్ట్రపతిగా ఎదిగి ప్రతి భారతీయుడికి స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు.అక్టోబర్ 15న జరుపుకునే అబ్దుల్ కలాం జయంతిని ఐక్యరాజ్యసమితి ప్రపంచ విద్యార్థుల దినోత్సవంగా గుర్తించడం ఆయన గొప్పతనానికి నిదర్శనమని తెలిపారు. యువత ఉన్నత లక్ష్యాలు పెట్టుకుని కష్టపడి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో తులసిరెడ్డి సతీమణి అలివేలమ్మతో పాటు కాంగ్రెస్ నాయకులు అమర్, బద్రీనాథ్, రమణ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
#APJAbdulKalam #BharatRatna #AbdulKalam #YouthInspiration #DrTulasiReddy #FormerPresident #IndianScientist #MissileManOfIndia #Education #Motivation #Congress #Vempalle #IndiaNews #BreakingNews #Tribute











