Home Cinema_News సెప్టెంబర్‌లో మహేంవద్రగిరి వారహి | Varahi Movie

సెప్టెంబర్‌లో మహేంవద్రగిరి వారహి | Varahi Movie

Vaarahi Movie

సుమంత్ హీరోగా సంతోష్ జాగర్లమూడి ప్రధానపాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం ’మహేంద్రగిరి వారాహి’ సోషియో ఫాంటసీ చిత్రాన్ని సెప్టెంబర్ 11న విడుదల చేయనున్నట్లు టీమ్ వెల్లడించింది. ఈ సినిమా కోసం రెండున్నరేళ్లు చర్చలు జరిగినట్లు సుమంత్ తెలిపారు. మధ్యలో ఈ సినిమా సందిగ్ధంలో పడిందని గుర్తుచేసుకున్నారు. ఇందులో ట్విస్ట్‌లు చాలా ఉన్నాయని తెలిపారు. ఓ స్టార్ హీరో దాదాపు 20 నిమిషాలు కనిపిస్తారని నిర్మాత మధు వెల్లడించారు. కథ నచ్చడంతో వెంటనే ఓకే చేశారు. వారాహి అమ్మవారిగా నటించారా లేదా.. మరేదైనా పాత్రలో కనిపిస్తారా అనేది స్క్రీన్‌పై చూసి తెలుసుకోవాలి. సంతోష్‌కు ఆధ్యాత్మికత, చరిత్ర గురించి చాలా విషయాలు తెలుసు. మొదట అనుకున్న కథలో కొన్ని మార్పులు చేసి దీన్ని రూపొందించాం. ఇందులో నటించడం చాలా ఆసక్తిగా అనిపిస్తోంది.