ఫ్రెష్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్‌ని పరిశీలించిన .
స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ చైర్మన్ పట్టాభిరామ్.
డోన్: నంద్యాల జిల్లా డోన్‌లో స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ఫ్రెష్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్ నిర్మాణ పనులను స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్, డైరెక్టర్ రవితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా పట్టాభిరామ్ మీడియాతో మాట్లాడుతూ, గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా 70 వేల టన్నులకు పైబడి చెత్త పేరుకుపోయిందన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర -స్వచ్ఛాంధ్ర ఉద్యమానికి శ్రీకారం చుట్టారని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఈ లెగసీ వేస్ట్ మొత్తాన్ని క్లియర్ చేసి, డంప్ యార్డ్ ఫ్రీ స్టేట్ గా రాష్ట్రాన్ని మార్చాలన్నది తమ లక్ష్యం అన్నారు. ఇందులో భాగంగా దాదాపు రూ.550 కోట్లు ఖర్చు పెట్టి రాష్ట్రవ్యాప్తంగా 107 ఫ్రెష్ వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్స్ ని నిర్మిస్తున్నట్లు పట్టాభిరామ్ వివరించారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలకు అనుగుణంగా, లెగసీ వేస్ట్ 70,812 మెట్రిక్ టన్నులలో ఇప్పటి వరకు 45వేల మెట్రిక్ టన్నులు క్లియర్ చేసినట్లు చెప్పారు. మిగిలిన చెత్త కూడా త్వరలోనే క్లియర్ చేస్తామన్నారు. వ్యర్థాల నుంచి తయారైన ఇంధనం(ఆర్డీఎఫ్)ని ఇక్కడికి దగ్గరలో ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీలకు పంపిస్తారని చెప్పారు. ఈ పనులు అన్నిటినీ త్వరితగతిన పూర్తి చేయాలని కార్పోరేషన్ కమిషనర్, పబ్లిక్ హెల్త్ అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు.
ఏజెన్సీలకు కూడా గట్టిగా చెప్పినట్లు తెలిపారు. ఇందుకు అవసరమైన అదనపు మెషినరీ కూడా ఎల్లుండికి ఇక్కడికి రాబోతున్నట్లు చెప్పారు.
రూ.1.25 కోట్ల వ్యయంతో ఇక్కడ నిర్మిస్తున్న ప్రాసెసింగ్ ప్లాంట్ ప్రతిరోజు దాదాపు 27 టన్నుల చెత్తని ప్రాసెస్ చేయగల సామర్థ్యం కలిగి ఉంటుందని తెలిపారు. ఈ ప్లాంట్ నిర్మాణ పనులు రెండు వారాల్లో పూర్తి అవుతాయని చెప్పారు. దానికి సంబంధించిన మెషినరీ ఇక్కడికి చేరుకున్నట్లు తెలిపారు. ఇది ప్రారంభమైతే, డోన్ పట్టణంలో ఇక డంపింగ్ అనేది ఉండదని, ఏ రోజు చెత్త ఆ రోజు ప్రాసెస్ చేస్తారన్నారు. తడి చెత్త నుంచి కాంపోస్ట్ తయారు చేసి, రైతులకు ఉపయోగపడే విధంగా న్యూట్రియెంట్ వాల్యూస్ ని ఎన్రీచ్ చేసి మార్క్ ఫెడ్ ద్వారా బయో ఫర్టిలైజర్ ని రైతులకు అందిస్తామని చెప్పారు. పొడి చెత్తలో ఉపయోగపడే వాటిని రీసైక్లింగ్ ఫ్యాక్టరీస్ కి పంపుతామన్నారు. అతి త్వరలోనే డోన్ డంప్ యార్డ్ ఫ్రీ పట్టణంగా నిలుస్తుందన్నారు.
డోన్ పట్టణ ప్రజల భాగస్వామ్యం
ప్రభుత్వం ఇంత చిత్తశుద్ధితో ఈ కార్యక్రమాలన్నీ చేపడుతున్న పరిస్థితిలో డోన్ పట్టణ ప్రజల భాగస్వామ్యం కూడా అవసరం అని అన్నారు. ఇంటి దగ్గరే తడి చెత్త, పొడి చెత్త వేరుచేసి, మున్సిపల్ అధికారులు సూచనలను పాటించి ఈ ఉద్యమంలో పట్టణ ప్రజలు పాల్గొనాలని చైర్మన్ పట్టాభిరామ్ పిలుపు ఇచ్చారు.
#Dhone #WasteProcessingPlant #SwachhAndhra #DumpYardFree #LegacyWaste #Nandyal #Pattabhiram #ChandrababuNaidu #SolidWasteManagement #FreshWasteProcessing #Recycling #Compost #CleanAndhra #MunicipalDevelopment #SwarnaAndhra











