Home General గోదావరిలో వారాహిమాత దీక్షల సందడి ఆషాఢంలో భక్తుల విశేష భక్తి

గోదావరిలో వారాహిమాత దీక్షల సందడి ఆషాఢంలో భక్తుల విశేష భక్తి

8



గోదావరి జిల్లాల్లో ఆషాఢ మాసం సందర్భంగా వారాహిమాత దీక్షలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో పెద్ద సంఖ్యలో భక్తులు వారాహిమాత మాలలు ధరించి దీక్షలు చేపడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వారాహిమాత ఆలయాలు ప్రాచుర్యం పొందుతున్నాయి. కాకినాడ జిల్లాలోని కొవ్వూరు, పెదపూడి మండలం గొల్లల మామిడాడ, బలభద్రపురం తదితర ప్రాంతాల్లోని ఆలయాలకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఆషాఢ మాసంలో చేపట్టే ఈ దీక్షలను అత్యంత పవిత్రంగా భావిస్తారు. భక్తులు 9, 11 లేదా 48 రోజుల పాటు నియమనిష్ఠలతో దీక్షలు నిర్వహించి అమ్మవారిని ఆరాధిస్తారు. కోరిన కోరికలు నెరవేరుతాయని విశ్వసిస్తూ ప్రత్యేక పూజలు, నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా శ్రీ వారాహి దుర్గా ద్విశక్తి పీఠంలో గుప్త నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారిని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, పెదపూడి మండలం కూటమి నాయకులతో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులతో ఆలయాలు కిటకిటలాడుతున్నాయి.

 

#VarahiMata #VarahiDeeksha #AshadaMasam #GodavariDistricts #PawanKalyan #GuptaNavaratri #AndhraPradesh #VarahiTemple #HinduTraditions #DevotionalNews #Kakinada #Anaparthi #Godavari #Spirituality #TempleFestivals