పట్టాభిరామ్.. తేల్చుకుందాం రా!
ప్రొద్దుటూరు నిజంగా స్వచ్ఛంగా ఉందా.. లేక కాగితాలకే పరిమితమైన ప్రచారమా? ప్రజలే జడ్జిలని చెబుతూ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కూటమి ప్రభుత్వానికి నేరుగా సవాల్ విసిరారు. “పట్టణం పరిశుభ్రంగా ఉందని ప్రజలు చెబితే నీ ఇంట్లో మూడేళ్లు పారిశుధ్య పనులు చేస్తా.. లేకపోతే నా ఇంట్లో అదే పని చేయడానికి సిద్ధమా?” అంటూ పట్టాభిరామ్కు ఛాలెంజ్ చేశారు. స్వచ్ఛాంధ్ర పేరుతో గొప్పలు చెప్పుకోవడం కంటే వీధుల్లోకి వచ్చి వాస్తవాలు చూడాలని ఎద్దేవా చేశారు. ప్రచారంతో కాదు.. ప్రజల తీర్పుతోనే ఎవరి మాట నిజమో తేలిపోతుందని రాచమల్లు వ్యాఖ్యానించారు.