తెలంగాణ తదుపరి ప్రధాన కార్యదర్శి గా 1992 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు నియమితులయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థన మేరకు, ఆయనను కేంద్ర డెప్యుటేషన్ నుండి మాతృ కేడర్‌కు తిరిగి పంపించేందుకు అపాయింట్‌మెంట్స్ కమిటీ జూన్ 23న ఆమోదం తెలిపింది. ప్రస్తుత సీఎస్ రామకృష్ణ రావు పదవీకాలం జూన్ 30తో ముగియనుండటంతో సంజయ్ జాజు పేరు బలంగా వినిపిస్తోంది. 57 ఏళ్ల సంజయ్ జాజు అడ్మినిస్ట్రేషన్‌లో అత్యంత సమర్థుడిగా పేరొందారు. విప్లవాత్మక ‘మీసేవ’ ప్రాజెక్టును ఆయనే రూపొందించారు. కేంద్రంలో రక్షణ, సమాచార ప్రసారాల శాఖల కార్యదర్శిగా పనిచేశారు. రెండుసార్లు నేషనల్ ఇ-గవర్నెన్స్ గోల్డ్ అవార్డులతో పాటు పీఎం అవార్డును కూడా అందుకున్నారు.
#SanjayJaju #TelanganaCS #TelanganaGovernment #ChiefSecretary #IASOfficer #1992BatchIAS #SanjayJajuIAS #Meeseva #EGovernance #TelanganaNews #Bureaucracy #CivilServices #RamakrishnaRao #Administration #Governance #DigitalIndia #IASNews #Hyderabad #TelanganaPolitics #BreakingNews











