16 ఏళ్ల వయసులోనే లక్ష్మణన్ మెయ్యప్పన్ ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కుడైన పురుష చార్టర్డ్ అకౌంటెంట్‌గా గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించారు. 16 ఏళ్ల 141 రోజుల వయసులో దుబాయ్‌లో ఈ రికార్డును సొంతం చేసుకున్నారు. కోవిడ్ సమయంలో పదో తరగతి పూర్తి చేసిన తర్వాత ఆర్థిక రంగంపై ఆసక్తి పెంచుకున్న లక్ష్మణన్ 15 ఏళ్లకే ACCA చదువు ప్రారంభించి సుమారు ఏడాదిలో పూర్తి చేశారు. అనంతరం సీఎఫ్ఏ అర్హత సాధించాడు. ప్రస్తుతం ఫైనాన్స్‌లో ఎమ్మెస్సీ చదువుతూ దుబాయ్‌లోని సెంచరీ ఫైనాన్షియల్ సంస్థలో సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్‌గా పనిచేస్తున్నారు. పెట్టుబడులు, మార్కెట్ విశ్లేషణ, ఆర్థిక నిర్ణయాలకు సంబంధించిన అంశాల్లో పనిచేస్తున్నారు. తల్లి కూడా ఏసీసీఏ కావడంతో చిన్నప్పటి నుంచే అకౌంటింగ్‌పై ఆసక్తి పెరిగినట్లు తెలుస్తోంది. చదువును వేగంగా పూర్తి చేయడం తన లక్ష్యం కాదని, ఆర్థిక వ్యవస్థను లోతుగా అర్థం చేసుకోవడమే ముఖ్యమని లక్ష్మణన్ చెబుతున్నారు. చదువుతో పాటు ఖాళీ సమయంలో వాచీల డిజైన్, తయారీలోనూ ఆసక్తి చూపుతున్నారు. చిన్న వయసులోనే వృత్తిపరమైన అర్హతలు సాధిస్తూ, ఉన్నత విద్య కొనసాగిస్తూ, ఉద్యోగ అనుభవం పొందుతున్న లక్ష్మణన్ ప్రయాణం విద్యార్థులకు కొత్త స్ఫూర్తిగా నిలుస్తోంది.
#LaxmananMeiyappan #GuinnessWorldRecord #YoungestCharteredAccountant #CharteredAccountant #YoungestCA #ACCA #CFA #Dubai #Finance #FinancialAnalyst #YoungAchiever #StudentAchievement #WorldRecord #EducationNews #SuccessStory











