మళ్లీ టెస్ట్ క్రికెట్‌లోకి కోహ్లీ – పునరాగమనంపై ఫుల్ క్లారిటీ

13

భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌లో తిరిగి ఆడే అవకాశాలపై వస్తున్న ఊహాగానాలకు పూర్తి స్థాయిలో తెరదించాడు. 2025లో ఇంగ్లండ్ సిరీస్‌కు ముందు టెస్ట్ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన కోహ్లీ, మళ్లీ ఎర్ర బంతి క్రికెట్‌లోకి వస్తాడా అనే ప్రశ్నకు తాజాగా ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో స్పందించాడు. “నేను ఆ ఫార్మాట్‌తో పూర్తిగా ముగించాను. ధన్యవాదాలు” అంటూ క్లియర్‌గా సమాధానం ఇచ్చాడు. దీంతో టెస్ట్ క్రికెట్‌లో కోహ్లీ పునరాగమనంపై జరుగుతున్న అన్ని చర్చలకు ముగింపు పలికినట్టైంది. 37 ఏళ్ల కోహ్లీ తన నిర్ణయాన్ని మార్చుకునే ఆలోచనలో లేడని స్పష్టమైంది. ఇదిలా ఉండగా వచ్చే నెల ఇంగ్లండ్‌తో జరిగే మూడు వన్డేల సిరీస్‌కు కోహ్లీ భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. అయితే అతని ఎంపిక ఫిట్‌నెస్ క్లియరెన్స్‌కు లోబడి ఉంటుంది. ఐపీఎల్ సందర్భంగా హామ్‌స్ట్రింగ్ గాయానికి గురైన కోహ్లీ ఇటీవల అఫ్గానిస్థాన్ సిరీస్‌కు దూరమయ్యాడు. బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఫిట్‌నెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తే జట్టుతో చేరనున్నాడు. మరోవైపు అఫ్గానిస్థాన్ సిరీస్‌లో రెండు సెంచరీలు చేసిన యశస్వి జైస్వాల్‌కు చోటు దక్కకపోవడం కూడా చర్చనీయాంశంగా మారింది. కోహ్లీ తిరిగి రావడంతో అతని స్థానంలో ఎంపికైన జైస్వాల్ జట్టుకు దూరమయ్యాడు.

 

#ViratKohli #KingKohli #TestCricket #ViratKohliRetirement #TeamIndia #IndianCricket #CricketNews #ViratKohliNews #EnglandSeries #ODISeries #BCCI #CricketUpdate #ViratComeback #TestRetirement #RedBallCricket #KohliStatement #FitnessUpdate #HamstringInjury #YashasviJaiswal #ODITeam #EnglandTour #IndianTeam #SportsNews #CricketFans #ViratFans #TeamSelection #BreakingNews #CricketBuzz #WorldCupPreparations #KohliLatest