నకిలీ లేఖలతో దళారి భారీ మోసం
తిరుమల టూ టౌన్ పీఎస్‌లో కేసు నమోదు
తిరుమలలో సుప్రభాత సేవ టికెట్లు, వసతి గదులు ఇప్పిస్తానని నమ్మబలికి గుంటూరు జిల్లాకు చెందిన 60 భక్తులను ముంచిన నిమ్మల శ్రీనివాస్ అనే వ్యక్తిపై తిరుమల టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. టీటీడీ ఉద్యోగుల పేర్లు, నకిలీ సిఫారసు లేఖలతో నిందితుడు బాధితుల నుండి ఏకంగా 4 లక్షల 22 వేల రూపాయలు వసూలు చేశాడు. దర్శనం కోసం తిరుమల చేరుకున్న భక్తులకు నిందితుడి ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో మోసం వెలుగుచూసింది. బాధితుల ఫిర్యాదుతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితుడి కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. భక్తులు మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని, అధికారిక వెబ్‌సైట్ ద్వారానే టికెట్లు బుక్ చేసుకోవాలని తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఐపీఎస్ సూచించారు.
#Tirumala #TTD #Tirupati #DevoteeFraud #FakeRecommendationLetters #TicketScam #AccommodationScam #TirumalaDarshan #TirumalaNews #AndhraPradesh #PoliceCase #FraudCase #CyberFraud #Guntur #NimmalaSrinivas #TTDAlert #DevoteesBeware #TwoTownPolice #BreakingNews #TeluguNews











