తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిపై లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో అరెస్టైన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కోర్టులో సంచలన ఆరోపణలు చేశారు. రెండు రోజుల పోలీసు కస్టడీ ముగియడంతో అత్తాపూర్ పోలీసులు ఆయనను ఉప్పర్‌పల్లి మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. ఈ సందర్భంగా కోర్టు హాలులో ఉదయ్ కృష్ణారెడ్డి భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. సైబరాబాద్ సీపీ సజ్జనార్‌పై ఆయన మేజిస్ట్రేట్‌కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. విచారణ పేరుతో తనను సీపీ సజ్జనార్ తీవ్రంగా బెదిరించారని, ‘నిన్ను ఎన్‌కౌంటర్ చేస్తాం’ అంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఉదయ్ ఆరోపించారు.
సీసీ కెమెరాలు లేని చోట విచారణ
తనను సీసీ కెమెరాలు లేని ప్రాంతానికి తీసుకెళ్లి విచారించారని, టాస్క్‌ఫోర్స్ కార్యాలయంలో తీవ్రంగా వేధించారని ఉదయ్ కృష్ణారెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. విచారణ సందర్భంగా తనను ఎన్‌కౌంటర్ చేస్తామని బెదిరించారని కూడా ఆరోపించారు. ఈ ఆరోపణలను కోర్టు తీవ్రంగా పరిగణించింది. సీసీ కెమెరాలు లేని ప్రాంతంలో విచారణ ఎలా నిర్వహించారని మేజిస్ట్రేట్ పోలీసులను ప్రశ్నించారు. ఘటనపై పూర్తి వివరణ ఇవ్వాలని అత్తాపూర్ ఇన్‌స్పెక్టర్‌కు రెండు రోజుల్లోగా షోకాజ్ నోటీసులు జారీ చేశారు. రెండు రోజుల కస్టడీ విచారణలో ఉదయ్ కృష్ణారెడ్డి సహకరించలేదని పోలీసులు కోర్టుకు తెలిపారు.
#UdayKrishnaReddy #TraineeIPS #IPSOfficer #EncounterThreat #Sajjanar #CyberabadCP #TelanganaPolice #AttapurPolice #PoliceCustody #UpparpallyCourt #MagistrateCourt #PoliceInterrogation #CCTV #SexualHarassmentCase #HyderabadNews #TelanganaNews #IPSNews











