అసెంబ్లీలో రేవంత్ రెడ్డి సంచలనం.
కేసీఆర్ ఫామ్‌హౌజ్‌పై విచారణకు సీఎం ఆదేశం.
మీ భూములు, మా భూములపై సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమా? హరీశ్ సవాల్.
తెలంగాణ అసెంబ్లీలో భూముల వ్యవహారం ఒక్కసారిగా రాజకీయ వేడిని పెంచింది. ధరణి పోర్టల్, 22ఏ నిషేధిత భూములు, భూ రికార్డుల మార్పులు, ప్రభుత్వ భూముల పరిరక్షణపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు సభలో తీవ్ర చర్చకు దారితీశాయి. గత పాలనలో ధరణి అమలుతో భూ రికార్డుల్లో చోటుచేసుకున్న పరిణామాలపై ప్రశ్నలు లేవనెత్తిన సీఎం.. ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫాంహౌస్ భూములపై విచారణకు ఆదేశాలు జారీ చేసి, ప్రభుత్వ భూమి ఉన్నట్లు తేలితే స్వాధీనం చేసుకుని పేదలకు పంపిణీ చేస్తామని ప్రకటించారు. కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన భూములపై కూడా సభలో పలు వివరాలు వెల్లడించారు. మరోవైపు 22ఏ జాబితాపై బీఆర్ఎస్ ఇప్పటికే న్యాయ విచారణకు డిమాండ్ చేస్తుండగా, హరీశ్‌రావు ధరణితో పాటు కాంగ్రెస్ హయాంలోని భూ భారతి వ్యవహారాలపైనా సమగ్ర విచారణ జరపాలని సవాల్ చేశారు. దీంతో ‘ధరణి తప్పిదాలా? భూ భారతి పరిణామాలా?’ అన్న ప్రశ్నలతో రెండు పార్టీల మధ్య భూయుద్ధం మరింత ముదిరింది. ఆరోపణలు, ప్రత్యారోపణల మధ్య అసలు నిజం తేల్చాల్సింది మాత్రం భూ రికార్డులే. ఏ భూమి ఎప్పుడు నిషేధిత జాబితాలోకి వెళ్లింది? ఎవరి నిర్ణయంతో మార్పులు జరిగాయి? ఎవరికి హక్కులు దెబ్బతిన్నాయి? అనే ప్రశ్నలకు అధికారిక రికార్డులు, స్వతంత్ర విచారణ ద్వారా సమాధానాలు దొరకాల్సిన పరిస్థితి ఏర్పడింది. 22ఏ జాబితాపై ప్రభుత్వం తన లెక్కలు చెబుతుండగా, బీఆర్ఎస్ మాత్రం వాటిని ప్రశ్నిస్తోంది. ఈ భూవివాదం ఇక రాజకీయ సభలకే పరిమితం కాకుండా వేలాది భూహక్కులతో ముడిపడిన కీలక అంశంగా మారుతోంది.
#TelanganaLandRow #RevanthReddy #KCR #KCRFarmhouse #LandProbe #TelanganaAssembly #Dharani #BhuBharati #22ALands #HarishRao #BRS #Congress #Erravelli #TelanganaPolitics











