జగన్ కోసం అంత పని చేస్తారా? వైసీపీ కాపు రాజకీయాలు తగవు

8

టీడీపీ నేతల అభ్యంతరాలు

సచివాలయంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ మీడియా సమావేశం నిర్వహించారు. వైసీపీ నేతలు కోనసీమలో పెట్టింది “కాపు ఆత్మీయ సభ” కాదని, అది కేవలం “రాజకీయ నిరుద్యోగుల ఆర్తనాద సభ” అని ఎద్దేవా చేశారు. ప్రశాంతంగా ఉండే కోనసీమ ప్రాంతంలో జగన్ మోహన్ రెడ్డి కులచిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల ముందు కాకినాడ జిల్లాలో కాపులకు రిజర్వేషన్లు అవసరం లేదని జగన్ బహిరంగంగా ప్రకటించినప్పుడు ఈ వైసీపీ నేతలు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.
గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కాపులకు ఇచ్చిన ఐదు శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్‌ను జగన్ రద్దు చేసినప్పుడు ఈ కాపు నాయకులు నోరు విప్పలేదన్నారు రామానాయుడు, సానా సతీష్. అమాయక కాపు యువకులను అన్యాయంగా అరెస్టు చేస్తుంటే తోట త్రిమూర్తులు లాంటి వారు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. వైసీపీ నేతలు శవాల మీద పేలాలు ఏరుకునే దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని, ఎక్కడైనా శవం కనిపిస్తే దాని కులం వెతికే హేయమైన సంస్కృతి వారిదని ధ్వజమెత్తారు. చరిత్రలో కాపులకు రిజర్వేషన్లు ఇచ్చింది దామోదరం సంజీవయ్య, చంద్రబాబు మాత్రమేనని మంత్రి స్పష్టం చేశారు. నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, జగన్ రెడ్డి కాపు రిజర్వేషన్లను రద్దు చేసి కాపు ద్రోహులుగా మిగిలిపోయారన్నారు. రామలక్ష్మణుల మాదిరిగా చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ కలిసి ఉన్నంత కాలం వారి బంధాన్ని విడదీయడం ఎవరి తరం కాదని తేల్చి చెప్పారు.

 

#TDP #NimmalaRamaNaidu #SanaSatish #YSRCP #KapuAtmiyaSabha #Konaseema #JaganMohanReddy #ChandrababuNaidu #PawanKalyan #KapuReservations #AndhraPradeshPolitics #TDPvsYSRCP #PoliticalWar #APNews #BreakingNews