Home AP ఫేక్ కంటెంట్‌కు తావివ్వొద్దు ప్రజా సమస్యలే ప్రధాన అజెండా

ఫేక్ కంటెంట్‌కు తావివ్వొద్దు ప్రజా సమస్యలే ప్రధాన అజెండా


వన్ మ్యాన్ ఆర్మీలా పనిచేయండి.
సోషల్ మీడియా ప్రతినిధులకు సజ్జల సందేశం.

వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్తలు పార్టీ ప్రచారానికే పరిమితం కాకుండా ప్రజల గొంతుకగా మారాలని పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో సోషల్ మీడియా రాష్ట్ర, జిల్లా, అసెంబ్లీ బాధ్యులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి కార్యకర్త ఒక “వన్ మ్యాన్ ఆర్మీ”లా పనిచేస్తూ ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలను అధికారిక ఆధారాలతో సోషల్ మీడియాలో ప్రజలకు చేరవేయాలని సూచించారు. గ్రామస్థాయి వరకు డిజిటల్ వాలంటీర్ నెట్‌వర్క్‌ను బలోపేతం చేసి ఫేస్‌బుక్, ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, వాట్సాప్ వంటి వేదికలను సమర్థంగా వినియోగించాలని చెప్పారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ, నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల అంశాలను సోషల్ మీడియాలో బలంగా ప్రస్తావించాలని నాయకత్వం సూచించింది.

క్రమశిక్షణతోనే సోషల్ మీడియా పోరాటం

సోషల్ మీడియాలో చేసే ప్రతి విమర్శకు జీవోలు, అధికారిక పత్రాలు, ఎఫ్‌ఐఆర్‌లు వంటి ఆధారాలు తప్పనిసరిగా జత చేయాలని పార్టీ నేతలు స్పష్టం చేశారు. అసభ్య పదజాలం, మార్ఫింగ్, ఫేక్ కంటెంట్‌కు ఎట్టి పరిస్థితుల్లోనూ తావివ్వొద్దని సూచించారు. ప్రజా సమస్యలను రీల్స్, ఇన్ఫోగ్రాఫిక్స్, వీడియోలు, వాయిస్ క్లిప్‌ల రూపంలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని పూడి శ్రీహరి పేర్కొన్నారు. అక్రమ కేసులు ఎదుర్కొంటున్న సోషల్ మీడియా కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి భరోసా ఇచ్చారు. క్రమశిక్షణ, అంకితభావంతో పనిచేస్తూ గ్రామస్థాయి నుంచి పార్టీ సోషల్ మీడియాను ప్రజా ఉద్యమంగా తీర్చిదిద్దాలని సమావేశంలో నాయకత్వం పిలుపునిచ్చింది.

 

#YSRCP #SajjalaRamakrishnaReddy #YSRCPSocialMedia #YSRCPDigitalCampaign #AndhraPradeshPolitics #PublicIssues #SocialMediaActivists #DigitalVolunteers #DSCIrregularities #CBIInquiry #UnemploymentAllowance #FeeReimbursement #FakeContent #SocialMediaDiscipline #APPolitics