వైసీపీ సర్ లెక్కలు… ఓటర్ల రక్షణే లక్ష్యంగా వ్యూహాలు!

15

అప్రమత్తంగా ఉండాలన్న సజ్జ

ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభమైన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, సర్ ప్రక్రియలో పార్టీ శ్రేణులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని వైయ‌స్ఆర్‌సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో ఆయన పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, బూత్ లెవల్ ఏజెంట్లతో మాట్లాడారు. ఓటర్ల జాబితా నుంచి తమకు అనుకూలంగా ఉన్న ఒక్క ఓటు కూడా తొలగిపోకుండా క్షేత్రస్థాయిలో గట్టిగా పని చేయాలని సూచించారు. ఎన్యూమరేషన్ ఫారాలు ప్రతి అర్హుడికి చేరేలా చూసి, వాటిని సక్రమంగా సేకరించాలన్నారు.

అధికార పార్టీ అడ్డంకులపై పోరాటం
బీఎల్‌వోలతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ ఓట్ల నమోదు ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని సజ్జల ఆదేశించారు. అధికార పార్టీ నేతల వల్ల ఓట్ల తొలగింపు లేదా ఏవైనా అడ్డంకులు ఎదురైతే వెంటనే స్పందించాలని చెప్పారు. పార్టీ పరంగా ఇప్పటికే కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. సాంకేతిక సమస్యలు లేదా రాజకీయ ఒత్తిళ్లు వచ్చినా వెంటనే పార్టీ కేంద్ర కార్యాలయానికి సమాచారం అందించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని స్పష్టం చేశారు.

సోషల్ మీడియా విస్తరణే ప్రధాన ధ్యేయం
రాబోయే రోజుల్లో సోషల్ మీడియాలో పార్టీ మరింత బలంగా పనిచేయాలని సజ్జల పేర్కొన్నారు. ప్రత్యర్థులు చేసే తప్పుడు ప్రచారాలను గట్టిగా ఎదుర్కొంటూ వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పార్టీ నెట్‌వర్క్‌ను గ్రామ స్థాయికి విస్తరించి ప్రజల వాణిని బలంగా వినిపించాలని సూచించారు. వీటితో పాటు పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియలో ఐడీ వెరిఫికేషన్‌ను వేగవంతం చేయాలని, ఎక్కడా జాప్యం లేకుండా పనులు పూర్తి చేయాలని పార్టీ శ్రేణులను ఆదేశించారు.

 

#YSRCP #SajjalaRamakrishnaReddy #SIR #SpecialIntensiveRevision #VoterListRevision #VoterRegistration #AndhraPradeshPolitics #YSJagan #BoothLevelAgents #ElectoralRolls #SocialMediaStrategy #PartyCadre #MembershipDrive #APNews #BreakingNews