చాలా హార్డ్ వర్క్ చేసిన సినిమా ఇది. మీకు కచ్చితంగా నచ్చుతుందని నమ్మకం ఉంది: టీజర్ లాంచ్ ఈవెంట్ లో రష్మిక మందన్న.
రష్మిక మందన్న, రవీంద్ర పుల్లె, అన్‌ఫార్ములా ఫిల్మ్స్ పాన్ ఇండియా మూవీ ‘మైసా’ గూస్‌బంప్స్ ఇంటెన్స్ టీజర్ లాంచ్
నేషనల్ క్రష్ రష్మిక మందన్న తన కెరీర్‌లో ప్రతిష్టాత్మక పాన్-ఇండియా యాక్షన్ డ్రామా ‘మైసా’లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో గోండ్ గిరిజన మహిళ పాత్ర పోషిస్తున్న రష్మిక , ఆ పాత్రలో ఒదిగిపొవడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు. రవీంద్ర పుల్లె దర్శకత్వంలో అన్‌ఫార్ములా ఫిల్మ్స్ నిర్మిస్తున్న’మైసా’ ఆకట్టుకునే ఫస్ట్ గ్లింప్స్‌తో ఇప్పటికే ఆసక్తిని రేకెత్తించింది. నవంబర్ 27, 2026న ‘మైసా’ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది. తాజాగా మేకర్స్ టీజర్ లాంచ్ చేశారు.
“అలసిపోయాను.. ఆగిపోయాను.. ఓడిపోయాను” అంటూ రష్మిక చెప్పే డైలాగ్‌తో ఆమె పాత్రలోని ఇంటెన్సిటీని పరిచయం చేశారు. భయపడని, వెనక్కి తగ్గని గిరిజన మహిళగా ఆమె పాత్ర అద్భుతంగా ఉంది. తాను ఎదుర్కొనే ఎన్నో సవాళ్లు, సామాజిక అడ్డంకులను అధిగమిస్తూ.. ప్రతి సమస్యను ఎదురించి పోరాడే ఒంటరి యోధురాలిగా మైసా కనిపిస్తుంది.
గోండ్ గిరిజన మహిళ పాత్రలో రష్మిక ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్‌లలో అదరగొట్టారు. బైక్‌ను ఎంతో ధైర్యంగా నడపడంతో పాటు.. అండర్‌వాటర్ సీక్వెన్స్‌లలోనూ సాహసోపేతమైన స్టంట్స్ చేశారు. పాత్ర కోసం రష్మిక తనను తాను పూర్తిగా మార్చుకున్న తీరు టీజర్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. ఆమె ఇంటెన్సిటీ, రా రేజ్, పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రజెన్స్ ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి. రవీంద్ర పుల్లే తన విజన్ ను స్క్రీన్‌పై అద్భుతంగా ప్రజెంట్ చేశారని టీజర్ చూస్తే అర్థమవుతోంది. ముఖ్యంగా నీటి అడుగున రష్మిక కొడవలిని పట్టుకుని కూర్చున్న షాట్ హాంటింగ్‌గా ఉండటంతో పాటు గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. ఈ సీక్వెన్స్ సినిమాపై క్యూరియాసిటీని మరింత పెంచుతోంది.
సినిమాటోగ్రాఫర్ శ్రేయాస్ పి. కృష్ణ దర్శకుడి విజన్‌ను అద్భుతమైన విజువల్స్‌గా మలిచారు. జేక్స్ బిజోయ్ అందించిన ఇంటెన్స్ స్కోర్ సినిమా డార్క్, యాక్షన్ వరల్డ్‌ను మరింత ఎలివేట్ చేస్తోంది. యాక్షన్ కొరియోగ్రాఫర్ కేచ రూపొందించిన యాక్షన్ బ్లాక్స్ రా, షార్ప్‌గా టాప్ క్లాస్ లో కనిపిస్తున్నాయి. భారీ ప్రొడక్షన్ వాల్యూస్ సినిమా స్కేల్‌ను మరింత పెంచాయి.
మొత్తంగా ‘మైసా’ టీజర్ ఒక ఇంటెన్స్, విజువల్లీ స్టన్నింగ్ యాక్షన్ డ్రామాపై అంచనాలు పెంచుతోంది. పవర్‌ఫుల్ ఫీమేల్ ప్రొటాగనిస్ట్‌గా రష్మిక చేసిన డిఫరెంట్ ట్రాన్స్‌ఫర్మేషన్, రవీంద్ర పుల్లే యాంబిషియస్ విజన్, స్పెక్టాక్యులర్ యాక్షన్, స్ట్రైకింగ్ విజువల్స్, జేక్స్ బిజోయ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కలిసి సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతున్నాయి. ‘మైసా’ చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో నవంబర్ 27, 2026న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ చేయనున్నారు.
#Maisa #RashmikaMandanna #MaisaTeaser #Rashmika #RavindraPulle #UnformalaFilms #PanIndiaMovie #ActionDrama #GondTribalWoman #JakesBejoy #ShreyasPKrishna #MaisaMovie #November27Release #TeluguCinema #IndianCinema











