పెద్ద పాము.. చిన్న కర్ర!
సీట్ల పంపకం ఒక సాకు.
ఆ రెండు పార్టీల లెక్క వేరు.
టీడీపీ–జనసేన కూటమిలో సీట్ల పంపకం ఇప్పుడు సాధారణ ఎన్నికల సర్దుబాటు కాదు.. 2029 రాజకీయ పటానికి ముందస్తు లెక్క! 2024లో వైసీపీని ఓడించేందుకు ఒక్కటైన మిత్రపక్షాలు.. ఇప్పుడు అధికారంలో ఎవరి బలం ఎంత? భవిష్యత్లో ఎవరి రాజకీయ స్థలం ఎంత? అన్న లెక్కల్లోకి వెళ్లాయి. టీడీపీ చేతిలో విస్తృతమైన కేడర్, దశాబ్దాల సంస్థాగత నిర్మాణం.. జనసేన చేతిలో 21కి 21 విజయాల రికార్డు, పెరుగుతున్న రాజకీయ ప్రభావం! అందుకే ఒకవైపు 80:15:5 ఫార్ములా.. మరోవైపు “గెలిచే సీట్లు మాత్రమే” అన్న వాదన. “పవన్ అన్న నన్ను ఒరేయ్ అని పిలుస్తాడు” అన్న లోకేశ్ మాటల్లో వ్యక్తిగత సాన్నిహిత్యం కనిపించినా.. సీట్ల లెక్క మాత్రం రాజకీయ బలంపైనే! జనసేనకు సీటు ఇస్తే టీడీపీ కేడర్లో అసంతృప్తి.. టీడీపీ అన్నీ తీసుకుంటే జనసేన విస్తరణకు బ్రేక్! బీజేపీ వాటా కూడా ఇంకా తేలాల్సి ఉంది. దీంతో బయటకు సీట్ల పంపకం కనిపిస్తున్నా.. లోపల మాత్రం కూటమిలో ఎవరి కేడర్ ఎక్కడ బలంగా ఉంది? ఎవరు ఎక్కడ గెలిపించగలరు? 2029కు ఎవరు ఎంత రాజకీయ స్థలం నిర్మించుకుంటారు? అన్న అసలు పోరు మొదలైంది. చిన్న పాము.. పెద్ద కర్ర ఎవరిది? పెద్ద పాము.. చిన్న కర్ర ఎవరిది? సమాధానం స్థానిక ఎన్నికల ఫలితాల్లోనే తేలనుంది.











