బ్రహ్మంగారిమఠం నూతన మేనేజర్ బాధ్యతలు

Brahmamgari Matham new manager

25

ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి దేవస్థానం నూతన మేనేజర్ గా పిపిఎన్ ప్రసాద్ బాధ్యతలు చేపట్టారు. సుదీర్ఘకాలం ఇక్కడ మేనేజర్ గా పనిచేసిన ఈశ్వర చారి పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో ప్రసాద్ నియమితులయ్యారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన బ్రహ్మంగారిమఠం పీఠాధిపతి శ్రీ వీరధర్మజ వెంకటాద్రి స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా నూతన మేనేజర్ పిపిఎన్ ప్రసాద్ మాట్లాడుతూ పీఠాధిపతి ఆదేశాల మేరకు బ్రహ్మంగారిమఠం విశిష్టతను, కీర్తి ప్రతిష్టలను మరింత పెంపొందించేలా పనిచేస్తానన్నారు.