రెండున్నరేళ్లలో వెయ్యి రొబోటిక్ శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేసిన నిమ్స్ వైద్య బృందాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. ఈ ఘనత సాధించిన నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాహుల్ దేవరాజ్‌తో పాటు వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, ఆపరేషన్ థియేటర్ బృందానికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యాధునిక వైద్య సేవలను సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే ప్రభుత్వ సంకల్పానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. నిమ్స్‌లో నిర్వహించిన రొబోటిక్ శస్త్రచికిత్సల్లో 90 శాతానికి పైగా ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఉచితంగా నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఇటీవలే 2,000 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు పూర్తి చేసిన నిమ్స్, ఇప్పుడు వెయ్యి రొబోటిక్ సర్జరీల మైలురాయిని చేరుకోవడం ప్రభుత్వ వైద్యరంగానికి గర్వకారణమని సీఎం పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా నిమ్స్ వైద్యరంగంలో మరిన్ని రికార్డులు సృష్టిస్తూ ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని ఆకాంక్షించారు.
#NIMS #RoboticSurgery #RevanthReddy #TelanganaHealth #NIMSHyderabad #RoboticSurgeryMilestone #Healthcare #GovernmentHospitals #Aarogyasri #CMReliefFund #KidneyTransplant #MedicalAchievement #HealthcareNews #TelanganaNews #HealthNews











