Home General గ్యాస్ ఈకేవైసీకి నేటితో గడువు ఆదివారం ఎలా చేయాలన్న బెంగ!

గ్యాస్ ఈకేవైసీకి నేటితో గడువు ఆదివారం ఎలా చేయాలన్న బెంగ!



గ్యాస్‌ ఈకేవైసీ గడువు ఆగస్టు 16 సాయంత్రంతో ముగియనుందన్న సమాచారంతో వినియోగదారుల్లో ఆందోళన మొదలైంది. ఈకేవైసీ పూర్తి చేయకపోతే గ్యాస్‌ సరఫరాపై ఆంక్షలు ఉండొచ్చని, సబ్సిడీపై ప్రభావం పడొచ్చనే ప్రచారంతో ఏజెన్సీల వద్ద వినియోగదారులు బారులు తీరుతున్నారు. అయితే నేడు ఆదివారం కావడంతో ఏజెన్సీలు పనిచేస్తాయా? గడువులోగా ఈకేవైసీ ఎలా పూర్తి చేసుకోవాలి? అన్న బెంగ చాలామందిలో కనిపిస్తోంది. శనివారం స్వాతంత్య్ర దినోత్సవం కావడంతో ఇప్పటికే ఒకరోజు సమయం తగ్గిపోయిందని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆదివారం కూడా ఏజెన్సీలు పనిచేసే అవకాశం ఉందని నిర్వాహకులు చెబుతున్నారు. పైస్థాయి నుంచి గడువు పొడిగింపుపై ఆదేశాలు వస్తే పరిస్థితి మారవచ్చని పేర్కొంటున్నారు.

 

#LPGeKYC #GasEKYC #LPGEKYCDeadline #August16 #LPG #GasCylinder #IndaneGas #BharatGas #HPGas #AadhaarEKYC #LPGSubsidy #GasConsumers #DomesticLPG #EKYCOnline #GasAgency #LPGNews #GasCylinderNews #AadhaarAuthentication