Home Telangana సురేఖను కాపాడేందుకు ప్రయత్నించాం

సురేఖను కాపాడేందుకు ప్రయత్నించాం

హైకమాండ్‌ నిర్ణయమే శిరోధార్యం.
బర్తరఫ్‌పై మహేశ్‌గౌడ్‌ కీలక వ్యాఖ్యలు.

కొండా సురేఖ బర్తరఫ్‌ వ్యవహారంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించకుండా కాపాడేందుకు తమ వంతుగా తీవ్రంగా ప్రయత్నించామని తెలిపారు. శనివారం మీడియాతో జరిగిన చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడుతూ.. సురేఖ విషయంలో అందరం ప్రయత్నం చేసినా బర్తరఫ్‌ నిర్ణయం పూర్తిగా ఏఐసీసీ పరిధిలో తీసుకున్న నిర్ణయమేనని స్పష్టం చేశారు. ఆమె విషయంలో హైకమాండ్‌ నిర్ణయానికి అంగీకరించలేదని తెలిపారు. ఢిల్లీలో జరిగిన చర్చల్లోనూ ప్రధానంగా కొండా సురేఖ, చిన్నారెడ్డి అంశాలపైనే చర్చ జరిగిందని చెప్పారు. ఇదే సమయంలో మంత్రివర్గ విస్తరణపై వస్తున్న ప్రచారానికి మహేశ్‌గౌడ్‌ తెరదించారు. ప్రస్తుతం క్యాబినెట్‌ విస్తరణకు సంబంధించి ఎలాంటి చర్చ జరగలేదని, హైకమాండ్‌ నుంచి కూడా ఎలాంటి సమాచారం లేదని స్పష్టం చేశారు. మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరగాలన్నది సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయమని పేర్కొన్నారు. తనకు మంత్రి పదవి వస్తుందన్న ప్రచారంపై కూడా తనకు సమాచారం లేదన్నారు. రేవంత్‌రెడ్డి రాహుల్‌గాంధీ ఆశయాలను నెరవేర్చారని చెప్పిన మహేశ్‌గౌడ్‌, కులగణనను శాస్త్రీయంగా నిర్వహించామని తెలిపారు. బీసీ హక్కుల కోసం దేశవ్యాప్తంగా వంద రోజుల ఉద్యమం చేపడతామని ప్రకటిస్తూ, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

 

#KondaSurekha #MaheshKumarGoud #MaheshGoud #KondaSurekhaDismissal #TelanganaCongress #TPCC #AICC #CongressHighCommand #RevanthReddy #TelanganaPolitics #TelanganaCabinet #CabinetExpansion #ChinnaReddy #BCRights #CongressPolitics #TelanganaNews